ఈ బడ్జెట్ నుంచి విద్యార్థులు కోరుకునేది ఇదే!

ప్రభుత్వం నుండి మంచి భవిష్యత్తుకు హామీ కావాలి అని రోష్నీ ఈ బడ్జెట్‌లో కోరుతోంది. భారతదేశ స్టార్టప్ విప్లవం వేగం ఇంత త్వరగా చల్లారిపోవడంతో

alternate

రోష్ని తన మొబైల్ ఫోన్‌ని పదే పదే చెక్ చేస్తూనే ఉంటుంది… ఆమెకు ఏ జాబ్ కన్సల్టెన్సీ నుండి కాల్స్ రాలేదు… ఆమె తన ఈమెయిల్‌ను కూడా రోజుకు చాలా సార్లు చెక్ చేస్తుంది… ఏదైనా కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వస్తుందని ఆశతో ఉంది… కానీ పాపం, మరో రోజు నిరాశతో గడిచిపోయింది … నిరాశతో పాటు ఆమె ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి… ఎందుకంటే.. ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ కోసం ఆమె తండ్రి విద్యా రుణం కింద రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నారు. కంపెనీలో ఉద్యోగం వస్తే అప్పు త్వరగా తీరుతుందని ఆశ. రోష్ని బెంగళూరు నుండి అమెరికా వరకు కలలు కన్నాది. కానీ ఆమె అవి తీరలేదన్న బాధ రోష్ని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

రోష్ని గత సంవత్సరం B.Tech పూర్తి చేసింది. కానీ ఆమెకు ఇంకా ఉద్యోగం రాలేదు. ఆమె కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు చాలా స్టార్టప్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చేవి. ఆమె సీనియర్లు చాలా మందికి భారీ ప్యాకేజీలు చెల్లించి ఉద్యోగం కూడా ఇచ్చారు. కానీ రోష్ని ఫైనల్ ఇయర్‌లో ఏ కంపెనీ కూడా కాలేజీ తలుపు తట్టలేదు.

నిజానికి, దేశంలోని లక్షలాది మంది యువతకు వచ్చిన సమస్యే రోష్నీకి వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా భారతీయులకు ముక్తకంఠంతో ఉద్యోగాలు ఇస్తున్న ఐటీ కంపెనీలు, కోవిడ్ తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. దేశంలోని అనేక పెద్ద ఐటీ కంపెనీలు విదేశాల్లో గతేడాది నుంచి నియామకాలను నిలిపివేశాయి. రిటైల్ ఈకామర్స్ రంగాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఆర్థిక మాంద్యం కారణంగా, కంపెనీలు ఇప్పటికే ఫ్రెషర్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. పైగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ ఉపాధి సమస్యలకు తోడైంది. గతేడాది  ఫ్రెషర్‌ల నియామకాలు 30 శాతం క్షీణించాయి. 2022తో పోలిస్తే, 2023లో ఫ్రెషర్‌ల కోసం కంపెనీల్లో ఉద్యోగావకాశాలు 20 శాతం తగ్గాయి. ఉద్యోగం వచ్చినా పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు శాశ్వత ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి. తాజా EPFO డేటా ప్రకారం, భారతదేశంలో వ్యవస్థీకృత రంగ ఉపాధి 30 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రభుత్వం నుండి మంచి భవిష్యత్తుకు హామీ కావాలి అని రోష్నీ ఈ బడ్జెట్‌లో కోరుతోంది. భారతదేశ స్టార్టప్ విప్లవం వేగం ఇంత త్వరగా చల్లారిపోవడంతో యూత్ బాగా నిరాశ చెందింది. ఉద్యోగాలు లేనప్పుడు, ఖరీదైన కాలేజీల్లో ఎవరు మాత్రం అడ్మిషన్ తీసుకుంటారు?

దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతున్న తీరు చూస్తుంటే.. రోష్నీ… విద్యా రుణాల్లో రాయితీ కోసం ప్రభుత్వం నుండి గ్యారెంటీ కోరుతోంది. రోష్నీ… ఎడ్యుకేషన్ సెక్టార్ లో ద్రవ్యోల్బణం నియంత్రించాలని కోరుకుంటోంది. కేవలం తల్లిదండ్రులు డబ్బు సమకూర్చులేకపోయినంత మాత్రాన.. ప్రతిభావంతులైన యువత కలలు కల్లలు కాకూడదు.

జాబ్ స్కామ్‌లపై కఠిన చర్యల కోసం ప్రభుత్వం నుండి హామీని రోష్ని కోరుతోంది. పరీక్షల నుంచి అపాయింట్‌మెంట్ల వరకు అన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.

ఈ ఎన్నికల బడ్జెట్‌లో రోష్ని వంటి విద్యార్థుల ఆశలు నెరవేరుతాయా?

Published: January 31, 2024, 14:37 IST

ఈ బడ్జెట్ నుంచి విద్యార్థులు కోరుకునేది ఇదే!