కిరాణా షాపుల వారు ఈ బడ్జెట్ లో కోరుకునేది ఇదే!

ఆన్‌లైన్, పెద్ద స్టోర్‌లతో పోటీ పడేందుకు, ఆ స్టోర్‌లలో స్టాక్‌ను నింపడానికి తక్కువ వడ్డీతో రుణాన్ని అందించడానికి

alternate

శివకుమార్ కిరాణా షాపులో కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఖాళీగా కూర్చొని ఉన్నాడు. ఒకప్పుడు సమయం
దొరక్క, కస్టమర్లతో బిజీగా గడిపేవాడు. ఈరోజు అతను వారి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

అనేక ఇన్‌స్టంట్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, పొరుగున ఉన్న పెద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ల రాకవల్ల
శివ కుమార్ పరిస్థితి ఈ స్థితికి వచ్చింది…

మరో నలుగురు డెలివరీ బాయ్‌లను నియమించుకుని హోమ్ డెలివరీ ప్రారంభించడానికి శివకుమార్ వద్ద
తగినంత మూలధనం లేదు. అలాగే పెద్ద దుకాణాలతో పోటీపడేంత స్థలం కూడా అతని వద్ద లేదు.

అతను ఇప్పుడు తన భవిష్యత్తుతో పాటు, నలుగురితో కూడిన తన కుటుంబం గురించి
ఆందోళన చెందుతున్నాడు…

మొత్తం ఇంటి ఖర్చులు… పిల్లల చదువులు… ముసలి తల్లిదండ్రులకు మందులు… అన్నీ తన దుకాణం
ఆదాయంతోనే నిర్వహిస్తున్నాడు…  ఇప్పుడు వ్యాపారం మందకొడిగా సాగితే ఇదంతా ఎలా సాగుతుంది? ఇది
అతనికి చాలా ఆందోళన కలిగిస్తోంది.

ఇది ఎన్నికల సంవత్సరం అని శివ కుమార్ విన్నాడు. ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర
బడ్జెట్‌ను సమర్పించబోతోంది.

అటువంటి పరిస్థితిలో, మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులకు నేరుగా ఆర్థిక సహాయం ప్రకటించిన 2019
సంవత్సరాన్ని ఆయన మళ్లీ గుర్తు చేసుకున్నాడు…

అందుకే ఈసారి ఎలాగైనా…ప్రభుత్వం తనలాంటి వారికి…స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించే వారికి
సంతోషం అనే గ్యారంటీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు.

ఆన్‌లైన్, పెద్ద స్టోర్‌లతో పోటీ పడేందుకు, ఆ స్టోర్‌లలో స్టాక్‌ను నింపడానికి తక్కువ వడ్డీతో
రుణాన్ని అందించడానికి వీలుగా గ్యారంటీ ఇవ్వలని కోరుకుంటున్నాడు…

శివకుమార్ లో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో మరో ఆందోళన కలవరపెడుతోంది…ఆరోగ్యం
ఉన్నంత వరకు పని చేయగలడు… అయితే దీని తర్వాత ఏమవుతుంది…? దుకాణాన్ని ఎవరు చూసుకుంటారు…?
కొడుకు ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు. మరి తన వృద్ధాప్యంలో ఏమవుతుంది?

అందుకే స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా ప్రభుత్వం పెన్షన్ హామీ ఇవ్వాలని శివ
కుమార్ కోరుతున్నాడు…

ఆయనకు కావాల్సిన మరో హామీ ఏమిటంటే…

తనలాంటి మధ్యతరగతి ప్రజలు కూడా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం ప్రయోజనాలను
పొందాలి… దానికి ప్రభుత్వం తక్కువ రుసుము వసూలు చేసినా సరే ఆ సదుపాయం కావాలని
కోరుకుంటున్నాడు…

ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ హామీలన్నీ ఇస్తే.. శివకుమార్ లాంటి చాలా మందికి ఊరట లభించినట్టే…

QC కోసం…

1.
శివ కుమార్ కు సంతోషం గ్యారెంటీ

–ఆన్‌లైన్, పెద్ద దుకాణాలతో పోటీ పడేందుకు సహాయం చేయండి
–చౌక రుణాలపై మూలధనాన్ని ఏర్పాటు చేయాలి

2.
శివ కుమార్ కు సంతోషం గ్యారెంటీ

–స్వయం ఉపాధి పొందే వారూ పెన్షన్ పొందాలి

3.
శివ కుమార్ కు సంతోషం గ్యారెంటీ

–మధ్యతరగతి వారు కూడా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం ప్రయోజనాలను పొందాలి

Published: January 29, 2024, 12:14 IST

కిరాణా షాపుల వారు ఈ బడ్జెట్ లో కోరుకునేది ఇదే!