MSMEలకు ఈ బడ్జెట్ లో తీపి కబురు ఉంటుందా?

మూడో హామీ... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్... వ్యాపారంలో అగ్నిమాపక, కార్మిక, కాలుష్యం, ఈపీఎఫ్‌వో... ఇలా 30కి పైగా విభాగాల

alternate

వ్యాపారవేత్త కేతన్ తన అప్లికేషన్ తో ప్రభుత్వ బ్యాంకు బయట కూర్చున్నాడు… ఆ దరఖాస్తు.. లోన్ రీస్ట్రక్చర్ కోసం. ఎందుకంటే అతను విక్రయించిన వస్తువులకు సంబంధించిన మొత్తాన్ని ఇంకా అందుకోలేదు.

ఇన్‌స్టాల్‌మెంట్‌ను కట్టడం మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆ భయం అతన్ని బ్యాంక్‌కి తీసుకువచ్చింది ..

కేతన్‌కి నోయిడాలో టీ-షర్టులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది… పెద్ద ఎగుమతి కంపెనీలు అతని క్లయింట్లుగా ఉన్నాయి.

కానీ కొత్త ఆర్డర్‌లు ఆరు నెలలుగా తక్కువగా ఉన్నాయి. పైగా తనకు రావాల్సిన పేమెంట్లదీ ఇదే పరిస్థితి…

చిన్న పరిశ్రమల లాభాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి హెచ్చు తగ్గులు కూడా వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి.
పెద్ద కంపెనీల లాగా ధరలను పెంచే స్వేచ్ఛ ఉండదు. మార్కెట్ నుండి డబ్బును సేకరించే అవకాశమూ లేదు…

చిన్న పరిశ్రమలు ప్రభుత్వం, బ్యాంకులు, మార్కెట్ దయ మీదే ఆధారపడ్డాయి.

కేతన్ లాంటి వ్యాపారులు ఈ ఏడాది ప్రభుత్వం నుంచి మూడు హామీలను కోరుకుంటున్నారు.

ముందుగా, తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్నాయి…

అధిక ఖర్చులు, ఎక్కువ వడ్డీ రుణాల వల్ల లాభాలను సాధించడం…

దాదాపు అసాధ్యం … కేతన్ కూడా వడ్డీ రాయితీ పథకం కావాలని కోరుకుంటున్నాడు…
రెండోది…. చిన్న ఎగుమతి సంబంధిత పరిశ్రమలకు సంబంధించింది. ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోంది… కాబట్టి దీని ప్రభావం అన్ని చోట్లా ఉంటుంది… ఎగుమతి సంబంధిత పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం కాస్త మద్దతు ఇస్తే బాగుంటుంది…

ఎగుమతుల కోసం తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వగలిగితే, లేదా ఎలాంటి తనఖా లేకుండా రుణాలు ఇవ్వగలిగితే, ప్రభుత్వం రుణాలపై ఏదైనా మారటోరియం ఇవ్వగలిగితే కాని పరిస్థితులు సానుకూలంగా మారవు …
మూడో హామీ… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్… వ్యాపారంలో అగ్నిమాపక, కార్మిక, కాలుష్యం, ఈపీఎఫ్‌వో… ఇలా 30కి పైగా విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలి.
వ్యాపారవేత్తల సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అనుమతులను తగ్గించాలి…
ఇప్పుడు కేతన్ డిమాండ్లకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే MSMEలు లేకుండా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల అసాధ్యం.

దేశం ఎగుమతుల్లో MSMEల వాటా 45 శాతం. ఈ రంగం దేశ GDPలో 29 శాతం వాటాను కలిగి ఉంది…

అంటే వారి విజయమే భారత్ విజయం…

Published: January 26, 2024, 17:24 IST

MSMEలకు ఈ బడ్జెట్ లో తీపి కబురు ఉంటుందా?