చిన్న ఇల్లు, పెద్ద లాభం! ఈ లాజిక్ ఏంటో తెలుసా?

స్టూడియో అపార్ట్‌మెంట్.. నివసించడం కంటే.. ఎక్కువ సంపాదించడానికి బెస్ట్ అని చెప్పాలి.పెట్టుబడి పరంగా, మీరు స్టూడియో ఫ్లాట్‌ని కొనుగోలు చేయవచ్చు

alternate

ఫ్లాట్ కోసం చూస్తున్న సువేష్.. దీనికోసం బ్రోకర్ తో ఫోన్ లో మాట్లాడాడు. మీ బడ్జెట్ ఎంత అని బ్రోకర్ అడిగాడు. 40 లక్షలు అని సువేష్ చెప్పాడు. ఈ బడ్జెట్ లో మీకు రెండు ఆప్షన్స్ వస్తాయన్నాడు. వీటిలో ఒకటేమో 1BHK ఫ్లాట్.. మరొకటేమో.. స్టూడియో అపార్ట్‌మెంట్. దీంతో ఈ రెండింటి సైజ్ ఎంతెంత ఉంటాయి అని సువేష్ అడిగాడు. స్టూడియో అపార్ట్‌మెంట్ పరిమాణం 300 స్క్వేర్ ఫీట్, 1 bhk పరిమాణం 600 చదరపు అడుగులు. స్టూడియో అపార్ట్ మెంట్.. సింగిల్ పర్సన్ కు మంచి ఆప్షన్ కావచ్చు. మీరు అద్దెకు కూడా ఇవ్వచ్చు అని బ్రోకర్ చెప్పాడు. రెండింటిలో దేని ధర తక్కువ అని సువేష్ అడగడంతో.. 1BHK రేటు తక్కువని బ్రోకర్ చెప్పాడు. 1BHK ఫ్లాట్ సైజ్ పెద్దదిగా ఉన్నా.. ఎందుకంత చీప్ అని సువేష్ ఆశ్చర్యపోయాడు. దీంతో ఆ బ్రోకర్ సువేష్ కు.. స్టూడియో అపార్ట్ మెంట్ కాన్సెప్ట్ ను చెప్పాడు.

ఈ మధ్య కాలంలో స్టూడియో అపార్ట్‌మెంట్ల క్రేజ్ శరవేగంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో… దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగాల కోసమో, పనుల కోసమో వస్తుంటారు… సాధారణంగా ఇక్కడ ప్రాపర్టీ ధరలు ఎక్కువగా ఉంటాయి.

అటువంటి పరిస్థితిలో, స్టూడియో అపార్ట్‌మెంట్‌లు పెట్టుబడిదారుల ఆప్షన్ గా మారుతున్నాయి, అలాగే అద్దెకుండేవారి ఆప్షన్ కూడా ఇదే.

స్టూడియో అపార్ట్‌మెంట్ అంటే ఏమిటి? ఇది 1-bhk ఫ్లాట్ కన్నా డిఫరెంట్ గా ఎలా ఉంటుంది? దీనిని కొనుగోలు చేయడం లాభదాయకమైన డీలా కాదా?

స్టూడియో అపార్ట్‌మెంట్ ఒక చిన్న సైజు యూనిట్… ఇందులో బెడ్‌రూమ్, కిచెన్, లివింగ్ రూమ్ అన్నీ ఒకే పెద్ద గదిలో ఉంటాయి.

ఇందులో బాత్రూమ్ మాత్రమే మూసి ఉండే ప్రాంతం. దీనికి ప్రత్యేక తలుపు ఉంటుంది. స్టూడియో అపార్ట్‌మెంట్‌ని స్టూడియో ఫ్లాట్ అని కూడా అంటారు.

స్టూడియో అపార్ట్‌మెంట్, 1 BHK ఫ్లాట్‌కి సంబంధించి ప్రజలలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది.

స్టూడియో, 1-BHK ఫ్లాట్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, 1-BHK ఫ్లాట్‌లో, ప్రతి గది గోడలతో డివైడ్ అయి ఉంటుంది. బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ అన్నీ వేరుగా ఉంటాయి.

సైజు గురించి చెప్పాలంటే, స్టూడియో అపార్ట్‌మెంట్ పరిమాణం 1-BHK ఫ్లాట్ కంటే తక్కువగా ఉంటుంది.

వాటి పరిమాణం 250 నుండి 500 చదరపు అడుగుల మధ్య ఉంటుంది. అయితే 1-BHK ఫ్లాట్ పరిమాణం సాధారణంగా 500 నుండి 600 చదరపు అడుగుల వరకు ఉంటుంది.

రెండో తేడా ఏమిటంటే 1-BHK ఫ్లాట్ నివసించడానికి వీలుగా నిర్మాణమైంది.

స్టూడియో అపార్ట్‌మెంట్ కాంపాక్ట్ లివింగ్ కోసం తయారైంది. దీనిని నివాస, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వసతి కోసం దీనిని అద్దెకు తీసుకుంటాయి. చాలా మంది వ్యక్తులు స్టూడియో ఫ్లాట్లలో ఆఫీసులను ఏర్పాటుచేస్తారు.

సైజులో చిన్నది… నిర్వహించడం కూడా చాలా సులభం.. స్టూడియో ఫ్లాట్లు చాలా వరకు…

మెట్రో లేదా ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, నోయిడా ఎక్స్‌టెన్షన్ వంటి పెద్ద నగరాల్లో అందుబాటులో ఉంటాయి.

స్టూడియో అపార్ట్‌మెంట్‌లు నగరంలోని ప్రైమ్ లొకేషన్స్‌లో నిర్మాణమయ్యాయి. అందుకే వీటిని లివింగ్ స్పేస్‌గానూ అలాగే ఆఫీసుగానూ ఉపయోగిస్తారు.

ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్‌మెంట్ల ధర రూ.25 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ఉంటుంది.

ఢిల్లీ-NCR IT హబ్‌ల గురించి చెప్పాలంటే, ఇక్కడ స్టూడియో అపార్ట్‌మెంట్‌ల ధర రూ. 40 నుండి 45 లక్షల మధ్య ఉంటుంది.
ఇది ఆస్తి ఉండే ప్రాంతం, స్టూడియో ఫ్లాట్‌తో వచ్చే సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది.

అయితే, అదే ప్రాంతంలో 1-BHK ఫ్లాట్ ధర రూ. 25 నుండి 30 లక్షలు ఉంటుంది.మెట్రో సిటీలో పనిచేసే యువకులు తమ ఆఫీసుకి దగ్గరలో స్టూడియో అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకోవచ్చు. పెద్ద నగరాల్లో తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఉంటున్న తల్లిదండ్రులకు స్టూడియో ఫ్లాట్‌లు కూడా ఉపయోగపడతాయి. వారంలో రెండు-మూడు సార్లు మెట్రో సిటీకి వెళ్లేవారు, హోటళ్లలో డబ్బులు వెచ్చించకూడదనుకునే వారు కూడా దీనిపై ఓ లుక్ వేయవచ్చు.

ఇప్పుడు మనం స్టూడియో ఫ్లాట్ ప్రయోజనాలు, సమస్యలను చూద్దాం. దీని బెనిఫిట్స్ చూస్తే..

1)- స్టూడియో ఫ్లాట్‌లు లొకేషన్, కనెక్టివిటీ ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇటువంటి ఫ్లాట్‌లు కమర్షియల్ హబ్‌లు లేదా కార్పొరేట్ ఆఫీస్ ఏరియాల వంటి ప్రధాన ప్రదేశాలలో నిర్మాణమవుతాయి. ఇక్కడ మంచి రవాణా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రయాణాన్ని ఆదా చేస్తుంది. ఖర్చులు, సమయాన్ని ఆదా చేస్తుంది. 2)- చాలా స్టూడియో అపార్ట్‌మెంట్‌లు ఉడ్ వర్క్, మాడ్యులర్ కిచెన్, AC, TV-ఫ్రిడ్జ్ వంటి సౌకర్యాలతో ఉంటాయి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. 3) – స్టూడియో అపార్ట్‌మెంట్ అద్దె ఆదాయానికి.. మంచి మూలం. అంటే అద్దె ద్వారా సంపాదించడం అని అర్థం. 4) – స్టూడియో అపార్ట్‌మెంట్ చిన్న సైజులో ఉన్నందున, శుభ్రం చేయడానికి తక్కువ సమయం, శ్రమ చాలు.

ప్రయోజనాలతో పాటు, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి, వీటిని కూడా చూద్దాం.

1)- స్టూడియో అపార్ట్‌మెంట్ ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులకు తగినది కాదు. అందువల్ల, కుటుంబాన్, పెద్ద కుటుంబాలను ప్లాన్ చేసే జంటలకు ఇది సరిపోదు. 2) చిన్న సైజు వల్ల చాలా మంది వ్యక్తులతో సమావేశాలు ఏర్పాటు చేయలేం. 3) మీ వద్ద చాలా గృహోపకరణాలు ఉంటే, మీకు స్టూడియో ఫ్లాట్ చిన్నదిగా అనిపిస్తుంది.

స్టూడియో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు..

మొదటిది- స్టూడియో ఫ్లాట్.. వాణిజ్యం లేదా కార్పొరేట్ హబ్ సమీపంలో ఉండాలి. రెండోది- డెవలపర్ పాత ప్రాజెక్ట్‌లను చూడాలి. సకాలంలో ప్రాజెక్ట్‌లను అందించే డెవలపర్‌ను ఎంచుకోవాలి. మూడోది- సూపర్ ఏరియాకు బదులుగా కార్పెట్ ఏరియాని చూడండి. స్టూడియో అపార్ట్మెంట్… కార్పెట్ ఏరియా కనీసం 150 నుండి 200 చదరపు అడుగులు ఉండాలి. కార్పెట్ ఏరియా అనేది ఫ్లాట్ లోపల మీరు ఉపయోగించగల నికర వినియోగ స్థలం.

స్టూడియో అపార్ట్‌మెంట్.. నివసించడం కంటే.. ఎక్కువ సంపాదించడానికి బెస్ట్ అని చెప్పాలి.

పెట్టుబడి పరంగా, మీరు స్టూడియో ఫ్లాట్‌ని కొనుగోలు చేయవచ్చు. అద్దె ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

మీరు నివసించడానికి పెద్ద ఇల్లు కొనాలనుకున్నప్పుడు, మీరు స్టూడియో ఫ్లాట్‌ను అమ్మి, దాని నుండి వచ్చిన డబ్బుతో డౌన్‌ పేమెంట్ చేయవచ్చు.

 

Published: May 8, 2024, 19:05 IST

చిన్న ఇల్లు, పెద్ద లాభం! ఈ లాజిక్ ఏంటో తెలుసా?