Apple iPad Pro విడుదల , దేశంలో 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు

యాపిల్‌ సరికొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను ‘లెట్‌ లూజ్‌’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. . తొలిసారిగా ఐప్యాడ్‌ ఎయిర్‌ను రెండు

alternate

హలో, నేను మీ సుమతి.. మీరు లంచ్‌ బాక్స్‌ వార్తలు వింటున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 80కి పైగా విమానాలు ఎందుకు రద్దు చేశారు ? ఒక సంవత్సరంలో UPI లావాదేవీలు ఎంత పెరిగాయి? దేశంలో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్స్ సంఖ్య ఎంత పెరిగింది? ఇవేకాకుండా బిజినెస్‌, పర్సనల్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన వార్తలను ఈ లంచ్‌ బాక్స్‌లో తెలుసుకుందాం.

దేశంలో ‘ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు’

దేశంలో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగింది. దేశంలోని ఎనిమిది పెద్ద నగరాల్లో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్స్ సంఖ్య గతేడాది 57 నుంచి 64కి పెరిగింది. వీటిని ‘ఘోస్ట్ షాపింగ్ కేంద్రాలు’గా వర్గీకరించారు. ‘ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు’ అంటే 40 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉన్న మాల్స్. ప్రీమియం ప్రాపర్టీలకు రిటైల్‌ విక్రయదారులు, వినియోగదారుల ప్రాధాన్యతే మాల్స్‌ సంఖ్య పెరగడానికి కారణమని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 29 నగరాల్లోని షాపింగ్ సెంటర్లు, పెద్ద మార్కెట్‌లను పరిగణనలోకి తీసుకున్నరు, దాదాపు 1 కోటి 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

– ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన 80కి పైగా విమానాలు రద్దు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వివాదాల్లో కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 80కి పైగా విమానాలను రద్దు చేసినట్లు తాజా సమాచారం. విమానయాన సిబ్బంది పెద్ద ఎత్తున అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లారు. అటువంటి పరిస్థితిలో, ఈ విమానాలు రద్దు చేశారు. ఈ అంశంపై పౌర విమానయాన అధికారులు నిఘా పెట్టారు. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తో AIX Connect ను విలీనం చేసే ప్రక్రియలో ఉందని చెప్పరు. ఈ విషయమై గత కొంతకాలంగా ఈ ఎయిర్‌లైన్‌ సిబ్బందిలో ఆగ్రహం నెలకొంది. ఇటీవల, ఎయిర్‌లైన్ క్యాబిన్ సిబ్బంది కూడా నిర్వహణ లోపం ,చెడు ప్రవర్తనపై యాజమాన్యంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కారు లేదా బైక్‌ల చలాన్‌ను సెటిల్ చేయడానికి మీకు గొప్ప అవకాశం

ఢిల్లీలో కారు లేదా బైక్‌ల చలాన్‌ను సెటిల్ చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది.. మే 11న ఢిల్లీలో లోక్ అదాలత్ జరుగుతుంది ..దీనిలో మీరు మీ వాహనంపై జారీ చేసిన చలాన్‌ను సెటిల్ చేసుకోవచ్చు లేదా పూర్తిగా మాఫీ చేసుకోవచ్చు.
లోక్ అదాలత్‌లో ఉంచబడే కేసులలో జనవరి 31, 2024 వరకు DTP పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వాణిజ్య వాహనాలతో కూడిన కాంపౌండబుల్ ట్రాఫిక్ చలాన్‌ల పరిష్కారం కూడా ఉంటుంది. రెడ్ లైట్ జంపింగ్‌తో పాటు, కాలుష్యం, నిర్దేశించిన వేగ పరిమితి కంటే వేగంగా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి చలాన్‌ను సమస్యలు పరిష్కరిస్తారు. దీని కోసం, ముందుగా మీరు ఢిల్లీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్ delhipolice.gov.in/notice/locadalat నుండి ఇ-చలాన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై వాటిని లోక్ అదాలత్‌కు తీసుకెళ్లాలి. ఢిల్లీలోని ద్వారక, కర్కర్‌దూమా, పాటియాలా హౌస్, రోహిణి రో, అవెన్యూ సౌత్ , టిస్ హజారీ కోర్టు ప్రాంగణంలో ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తారు.

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సెలబ్రిటీలు కూడా బాధ్యత

పతంజలి తప్పుదారి పట్టించే ప్రకటన కేసును విచారించిన సుప్రీంకోర్టు, ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా ఉత్పత్తి లేదా సేవ ప్రకటన తప్పుదారి పట్టించేదిగా తేలితే, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా సమానంగా బాధ్యులని పేర్కొంది…. IMA పట్ల సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ వ్యాక్సినేషన్ , అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రతికూల ప్రకటనలు చేసిందని పేర్కొంది.

– ఒక సంవత్సరంలో UPI లావాదేవీలు 50% పెరిగాయి

ఏప్రిల్ 2024లో 1,330 కోట్ల UPI లావాదేవీల ద్వారా మొత్తం ₹19.64 లక్షల కోట్లు బదిలీ చేశారు. లావాదేవీల సంఖ్య సంవత్సరానికి 50.11% పెరిగింది. అదే సమయంలో, బదిలీ చేయబడిన మొత్తం 38.70% పెరిగింది. ఏడాది క్రితం అంటే ఏప్రిల్ 2023లో 886 కోట్ల లావాదేవీల ద్వారా రూ.14.16 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా యూపీఐకి ఆదరణ నిరంతరం పెరుగుతోందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్‌లో కూడా యూపీఐ సేవలను ప్రారంభించింది.

Apple iPad Pro విడుదల చేసింది.

యాపిల్‌ సరికొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను ‘లెట్‌ లూజ్‌’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. . తొలిసారిగా ఐప్యాడ్‌ ఎయిర్‌ను రెండు సైజులు- 11 అంగుళాలు, 13 అంగుళాల తో కంపెనీ తీసుకొచ్చింది. బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో 128జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ నిల్వ సామర్థ్యాలతో కొత్త ఐప్యాడ్‌ లభించనుంది. 11 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.59,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.74,900గా నిర్ణయించారు. 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.79,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.94,900గా ఉన్నాయి. యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో వినియోగదారులు కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను ఆర్డరు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి వినియోగదారులు ఇవి అందుబాటులోకి వస్తాయి.

 

Published: May 8, 2024, 14:57 IST

Apple iPad Pro విడుదల , దేశంలో 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు