Paytmలో ఏఏ సేవలు కొనసాగుతాయి? ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

2024 సంవత్సరంలో సగటు జీతం పెంపు 9%గా అంచనా వేశారు. ఇది గతేడాది 9.2% కంటే తక్కువ. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ చేసిన సర్వే

alternate

హలో నేను మీ సుమతి… పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. ఇప్పుడు ఏఏ నగరాల్లో వాటి రేటు ఎంతుంది? Paytm ఎంత మంది ఉద్యోగులను తొలగించబోతోంది? ఈసారి సగటు జీతం పెంపు ఎంత ఉండొచ్చు? ఇలాంటి మరెన్నో విశేషాలు మన లంచ్ బాక్స్ లో..

రూ.2 తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర

సామాన్య ప్రజలకు ఊరట ఇస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు చొప్పున తగ్గించింది కేంద్రం. మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. కొన్ని ప్రధాన నగరాల పెట్రోల్ ధరలు గురించి చూద్దాం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.72, డీజిల్ రూ.87.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.104.21. అయితే డీజిల్ రేటు రూ.92.15. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.103.94, డీజిల్ రూ.90.76గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రేటు రూ.101.18, డీజిల్ రూ.92.76గా…

– రోడ్డు ప్రమాదంలో బాధితులకు నగదు రహిత చికిత్స!

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. రోడ్డు,రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పైలట్ ప్రాజెక్ట్ ను చండీగఢ్ నుండి ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు కింద… రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 7 రోజుల పాటు చికిత్సకు ఏర్పాట్లు ఉంటాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద.. ఏ రకమైన వాహనం వల్ల ప్రమాదాలు సంభవించినా వాటికి ప్రభుత్వం కవరేజీ ిస్తుంది. ఆసుపత్రులు క్లెయిమ్ చేసిన మొత్తాన్ని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఖర్చు చేస్తారు. రోడ్డు ప్రమాద కేసుల్లో సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.

– అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి రాజస్థాన్ ప్రభుత్వం పేరు కూడా చేరింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచింది. తాజా పెంపు తర్వాత ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి పెరిగింది. గతంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ ప్రభుత్వాలు డీఏను 4-4 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించాయి.

– 20% ఉద్యోగులను తొలగించనున్న Paytm

గత కొన్ని నెలలుగా, Paytm మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్’ వివిధ దశల్లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది టెక్ సంస్థ చేసిన అతిపెద్ద తొలగింపులలో ఇది ఒకటి. Paytm వ్యాపారాలను క్రమబద్ధీకరించడానికి, ఇంకా ఖర్చులను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక చర్యలో భాగంగా ఈ తొలగింపులు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీ వెళ్లడం వల్ల మరిన్ని ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని Paytm ప్రతినిధి ఒకరు తెలిపారు.

Paytmలో ఏఏ సేవలు కొనసాగుతాయి?

RBI తీసుకున్న చర్య తర్వాత, Paytm చెల్లింపుల బ్యాంక్‌కు సంబంధించిన సేవలపై మార్చి 16 నుండి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే Paytm అనేక సేవలు మునుపటిలానే అందుబాటులో ఉంటాయి. Paytm నుంచి UPI చెల్లింపు సేవలు ఇలాగే కొనసాగుతాయి. అటువంటి పరిస్థితిలో, Paytm ఉపయోగించి, మీరు మీ బిల్లులను మునుపటిలా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం తర్వాత కూడా, Paytm QR, సౌండ్‌బాక్స్‌కు సంబంధించిన సేవలు కొనసాగుతాయి. ఇక్కడ చిన్న తేడా ఏమిటంటే, Paytm కస్టమర్‌లు Paytm పేమెంట్ బ్యాంక్ వాలెట్‌ని ఉపయోగించలేరు. వారు తమ ఖాతాలను వేరే బ్యాంకుకు బదిలీ చేయాల్సి ఉంటుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ కార్డులను కస్టమర్లు ఉపయోగించలేరు. Paytm పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ద్వారా చెల్లింపు ఇక సాధ్యం కాదు.

– సగటు జీతం పెంపు 9% ఉంటుందా?

2024 సంవత్సరంలో సగటు జీతం పెంపు 9%గా అంచనా వేశారు. ఇది గతేడాది 9.2% కంటే తక్కువ. మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ చేసిన సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది. అయితే, మొత్తం సగటు పెంపు గత సంవత్సరం కంటే తక్కువగా ఉంది. ప్రీ కోవిడ్ స్థాయిలతో పోలిస్తే మెరుగైన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం, IT, BPO/KPO మినహా అన్ని రంగాలలో జీతం పెరుగుదల అంచనా ఉంది. డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్‌లుక్ 2024 సర్వే కూడా దేశంలోని ప్రతి మూడింటిలో ఒక సంస్థ ఈ సంవత్సరం రెండంకెల ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెబుతోంది.

ఆయుష్మాన్ భారత్‌ రివ్యూ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు

– ఆరోగ్య బీమా పథకం, ఆయుష్మాన్ భారత్‌ రివ్యూ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. పథకం “రూపకల్పన, అమలు, సూచనలను” సమీక్షించడానికి NITI ఆయోగ్ సభ్యుడు డాక్టర్ VK పాల్ అధ్యక్షతన నేషనల్ హెల్త్ అథారిటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ మోసాన్ని నిరోధించే మార్గాలను సూచించడంతో పాటు పథకం పనితీరును కూడా సమీక్షిస్తుంది. దుర్వినియోగం జరిగినా లేదా ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలన్నా దానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చిస్తుంది. 45 రోజుల్లోగా నివేదికను సమర్పిస్తుంది.

Published: March 15, 2024, 15:17 IST

Paytmలో ఏఏ సేవలు కొనసాగుతాయి? ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!