ఈ కంపెనీ గురించి తక్కువ మందికి తెలుసు! దీని షేర్ ఎంత లాభమో తెలుసా?

గత నెల రోజులుగా, ఈ కంపెనీ షేర్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 429.95 కంటే దాదాపు 12.5 శాతం దిగువన ట్రేడవుతున్నాయి.

alternate

చంపక్- ఏమైంది సందీప్ భాయ్…ఈరోజు మీరు చాలా నిశ్శబ్దంగా కనిపిస్తున్నారు?
సందీప్- (నో రియాక్షన్….(వార్తాపత్రిక చదవడంలో బిజీ)
చంపక్- సందీప్ భాయ్…నువ్వేమీ మాట్లాడటం లేదు…నా మీద కోపంగా ఉన్నావా?
సందీప్ (వార్తాపత్రికను మడతపెట్టి) – కోపం వచ్చినా సరే, అదేమీ విషయం కాదు కదా?
చంపక్- అరెరే సందీప్ భాయ్… ఏం జరిగిందో చెప్పండి?
సందీప్ – ఏమైంది అని అడుగుతున్నారా? మీరు నన్ను చాలాకాలం నుంచి దూరం పెడుతున్నారు. మీరు ముందేమో
ట్రావెలింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అసలు లెక్క చేయనట్టే ఉంది. చూస్తుంటే మీరు విదేశాలకు
విహారయాత్రక వెళ్లినట్టుంది.
చంపక్- హే సందీప్ భాయ్, మనకంత అదృష్టం ఎక్కడిది?, మనం డబ్బును ఎలాగోలా మేనేజ్ చేసినా, మనకు
వీసా ఎవరు ఇస్తారు?, అంత ఖాళీ సమయం ఎక్కడ దొరుకుతుంది? షెడ్యూల్ చాలా బిజీగా ఉంది, మీకు తెలుసు.
సందీప్- ఇదొక్కటే… చాలా సులభం…
చంపక్- సరే…అది ఎలా?
సందీప్- వీసా, పాస్‌పోర్ట్ మొదలైన వాటికి సంబంధించిన సేవలను అందించే అటువంటి కంపెనీ గురించి ఈరోజు
మీకు చెప్తాను.
చంపక్- ఇది లిస్ట్ అయ్యిందా… దాని షేర్లు కూడా లిస్ట్ అయ్యాయా? సందీప్ భాయ్ అది ఏ కంపెనీ… త్వరగా చెప్పు.
సందీప్- కాస్త ఓపిక పట్టండి బ్రదర్ అది కూడా లిస్ట్ అయింది. దాని గురించి నేను మీకు అన్నీ చెబుతాను. నేను
BLS ఇంటర్నేషనల్ గురించి చెబుతాను. ఫస్ట్ దాని గురించి అర్థం చేసుకోండి.

గ్లోబల్ వీసా ప్రాసెసింగ్, పౌరులకు ప్రభుత్వం అందించే సేవల అవుట్‌సోర్సింగ్ సర్వీసులు.. ఇవన్నీ అవుట్ సోర్సింగ్
మార్కెట్ లో ఓ భాగం. ఈ సెక్టార్ కు సంబంధించి ఏకైక లిస్టెడ్ కంపెనీ BLS ఇంటర్నేషనల్. ఈ వ్యాపారానికి
ఎక్కువ ఆస్తులు, మూలధనం అవసరం లేదు. నగదు ఉత్పత్తి బలంగా ఉంటుంది. ఇక వృద్ధి కోసం ఎక్కువ డబ్బును
వెచ్చించాల్సిన అవసరం లేదు. వీటన్నింటితో పాటు, ప్రయాణ రంగంలో గ్లోబల్ రికవరీని దృష్టిలో ఉంచుకుని
చూస్తే.. ఇది బలమైన సంస్థ.

BLS 2005వ సంవత్సరంలో పోర్చుగల్ రాయబార కార్యాలయానికి సేవలను అందించడం ప్రారంభించింది.
కంపెనీ వ్యాపారం ఇలా ప్రారంభమైంది. BLS మార్కెట్ వాటా ప్రయాణాల పెరుగుదల, మేజర్ కాంట్రాక్టుల
రెన్యువల్ తో మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి, కంపెనీ ప్రభుత్వం నుండి
పౌరుల సేవలు అంటే G2C, బ్యాంకింగ్ కరస్పాండెన్స్.. అంటే BC వ్యాపారంలోకి విస్తరిస్తోంది. వీసా ప్రాసెసింగ్,
కాన్సులర్.. అంటే VC వ్యాపారం.. అసెట్ లైట్ లాంటిది. అంటే, ఆస్తుల కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం
లేదు.

ప్రస్తుతం వీసా అవుట్‌సోర్సింగ్ పరిశ్రమ విలువ సుమారు $2.6 బిలియన్లు. ఈ రకమైన వ్యాపారాన్ని
ప్రారంభించడం చాలా కష్టం. దానిలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిశ్రమ 2 దశాబ్దాల
కిందటిది. కాబట్టి, మొత్తం వీసా మార్కెట్‌లో 35% మాత్రమే అవుట్‌సోర్స్ చేశారు. VFS గ్లోబల్ ఈ పరిశ్రమలో
మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్‌లు టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి,
కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, డబ్బును ఆదా చేయడానికి ప్రత్యేక సర్వీస్ ప్రొవైడర్‌లకు ఇప్పటికే
అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను అవుట్ సోర్స్ చేశాయి.

ఇది ఓ యునిక్ ఇండస్ట్రీ. ఈ రంగంలో కొన్ని పెద్ద సంస్థలే మార్కెట్లో ఉన్నాయి. దీనివల్ల BLS ఇంటర్నేషనల్‌కు
పెద్ద అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాటా సుమారు 12% ఉంది. అయితే, దీని బలమైన బ్రాండ్, పోటీ
ప్రయోజనాల వల్ల.. కొత్త ఒప్పందాల ఆధారంగా కంపెనీ మార్కెట్ వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. 2005లో
పోర్చుగల్ ఎంబసీకి సేవలను అందించడం ద్వారా తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ సంస్థ చాలా వేగంగా
విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థ 67 దేశాల్లోని 46 ప్రభుత్వాలకు కస్టమర్లుగా సేవలందిస్తోంది. కంపెనీ
ఇప్పటివరకు 6.2 కోట్లకు పైగా అప్లికేషన్లను ప్రాసెస్ చేసింది.

 

చంపక్- సందీప్ భాయ్, ఈ కంపెనీ వ్యాపారం చాలా బాగుంది. అయితే భవిష్యత్తు అభివృద్ధికి అవకాశాలు
ఏమిటి? కంపెనీకి ఏమైనా విస్తరణ ప్రణాళికలు ఉన్నాయా?
సందీప్ – అఫ్ కోర్స్ బ్రదర్

చైనా, రష్యా, మలేషియాలో ఇప్పటికే ఉన్న కాంట్రాక్టులు, కొత్త అవకాశాల కారణంగా వీసా వ్యాపారంలో
ఆదాయం పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇటీవల కంపెనీ డిజిటల్ సేవల విభాగంలో ఈ-గవర్నెన్స్,
బ్యాంకింగ్ కరస్పాండెన్స్ వ్యాపారాన్ని కన్సాలిడేట్ చేసింది. ఈ కంపెనీ SBI, PNB, BoB మొదలైన బ్యాంకులతో
ఒప్పందాల ద్వారా G2C, బ్యాంకింగ్ కరస్పాండెన్స్ సేవలను అందిస్తుంది. 2022 సంవత్సరంలో జీరో మాస్‌ను
కొనుగోలు చేయడంతో ఈ వ్యాపారం మరింత ఊపందుకుంది.

BLS కూడా ఈ వ్యాపారంలో వేల్యూ యాడెడ్ సర్వీసుల ద్వారా రాబడి, మార్జిన్‌లను మెరుగుపరచుకోవడానికి
పనిచేస్తోంది. వీసా ప్రాసెసింగ్ కంపెనీలు వేల్యూ యాడెడ్ సర్వీసులను అందిస్తాయి. అనువాదం, హోమ్ డెలివరీ,
మొబైల్ వీసా వంటి సేవలు.. వీసా ప్రాసెసింగ్ ఫీజులు కాకుండా దీనికి అదనపు ఖర్చు ఉంటుంది. అయితే, ఈ VAS
అమలు అనేది ముందస్తు వ్రాతపూర్వక ఆమోదం అలాగే స్థానిక చట్టాలపై ఆధారపడి ఉంటుంది.

ఏదైనా ఒప్పందం మొత్తం విలువలో 30-40% VAS నుండి వస్తుందని గణాంకాలు చూపిస్తున్నాయి. మధ్యస్థం
నుండి దీర్ఘకాలంలో ఈ వాటా 50-60% వరకు పెరుగుతుందని కంపెనీ యాజమాన్యం విశ్వసిస్తోంది. ఈ విలువ
ఆధారిత సేవల నుండి కంపెనీ సుమారు 15% ఆపరేటింగ్ మార్జిన్‌ను సంపాదిస్తుంది. ఇది కాకుండా, BLS
ఇంటర్నేషనల్ ఇటీవలే iDATA, దాని అనుబంధ కంపెనీలలో 100% వాటాను 450 కోట్ల రూపాయలకు
కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. iDATA KBLS… FY25 ఫలితాలలో రూ. 200 కోట్ల
ఆదాయం, రూ. 85 కోట్ల ఆపరేషనల్ ప్రాఫిట్ ఉంది.

చంపక్ – సందీప్ భాయ్… కంపెనీ బిజినెస్ ఏంటో నాకు అర్థమైంది. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. కానీ
వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. అవన్నీ ఈసారి చెప్పే ఉద్దేశం లేదా?
సందీప్- బ్రదర్.. నేను మీ నుండి ఎప్పుడైనా ఏమైనా దాచానా? ఇదిగో ఎక్స్ పర్ట్ వాయిస్ కూడా వినండి.

చంపక్ – ఇదంతా బాగానే ఉంది సందీప్ భాయ్… కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది. ఇప్పటివరకు ఆర్థిక పనితీరు
ఎలా ఉంది?
సందీప్ – ఇది నాకు ఇష్టమైన ప్రశ్న చంపక్. నీ ఈ ప్రశ్న కోసం నేను చాలా క్యూరియాసిటీతో ఎదురు
చూస్తున్నాను.

FY23లో కంపెనీ ఆదాయం రూ.850 కోట్ల నుంచి రూ.1,516 కోట్లకు, ఆపరేషనల్ ప్రాఫిట్ రూ.108 కోట్ల నుంచి
రూ.223 కోట్లకు… అదే విధంగా లాభం రూ.111 కోట్ల నుంచి రూ.204 కోట్లకు పెరిగింది. ప్రాఫిట్‌మార్ట్
సెక్యూరిటీస్ FY24లో ఆదాయం రూ.1700 కోట్లు. FY26లో రూ. 2000 కోట్లుగా ఉంటుందని అంచనా
వేయగా… FY24లో రూ. 325 కోట్లు, FY25లో రూ. 400 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

చంపక్ – సందీప్ భాయ్… లెక్కలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి కంపెనీ షేర్ల పరిస్థితి ఏమిటి?
దీని కోసం నిపుణులు ఏ టార్గెట్ ను సజెస్ట్ చేస్తున్నారు?
సందీప్ – జాగ్రత్తగా వినండి బ్రదర్. (చార్ట్‌తో వివరించండి)

గత నెల రోజులుగా, ఈ కంపెనీ షేర్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 429.95 కంటే దాదాపు
12.5 శాతం దిగువన ట్రేడవుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్ల
విలువైన కాంట్రాక్టులు రెన్యువల్ కు రానున్నాయి. ఈ కాంట్రాక్టుల్లో ఒక్కటైనా కంపెనీ దక్కించుకుంటే..
ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టులతో పోలిస్తే వీటిలో
రియలైజేషన్స్ దాదాపు రెండింతలు అని చెప్పాలి.

కంపెనీ… వీసా ప్రాసెసింగ్, డిజిటల్ సర్వీసెస్ విభాగాలు రెండింటిలోనూ ముందస్తు ఫీజులను సేకరిస్తుంది. అందుకే
కంపెనీ బిజినెస్ మోడల్ క్యాష్ ఫ్లో బాగుంటుంది. ఇదే కాదు, కంపెనీ నిర్వహించే చాలా కేంద్రాలు లీజుపై
ఉన్నాయి. ఇది విస్తరణ ఖర్చులను తగ్గిస్తుంది. కంపెనీకి ఎటువంటి రుణాలు లేవు. కార్యకలాపాల నుండి నగదు
ప్రవాహం గత 5 సంవత్సరాలుగా స్థిరంగా సానుకూలంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వచ్చే 12 నుంచి
15 నెలలకు రూ.465 లక్ష్యంతో వాటాను కొనుగోలు చేయవచ్చు.,

 

సందీప్ – ఐతే చంపక్… ఈ కంపెనీ వ్యాపారం గురించి, విదేశాలకు వెళ్లే సులువైన మార్గం గురించి మీకు
అర్థమైందా?
చంపక్ – ఒప్పుకున్నాను సందీప్ భాయ్. ఇది.. ఎంత గొప్ప కంపెనీ! ఈ షేర్ ద్వారా వచ్చే సంపాదనతో ఏదో
ఒకరోజు విదేశాలకు వెళ్లొచ్చేమో అనిపిస్తుంది.

Published: April 2, 2024, 17:41 IST

ఈ కంపెనీ గురించి తక్కువ మందికి తెలుసు! దీని షేర్ ఎంత లాభమో తెలుసా?