మ్యూచువల్ ఫండ్స్ రిడింప్షన్ ఎలా చేయాలి? దీనికున్న.. 3 సూత్రాల ఫార్ములా ఏమిటి?

ఇటువంటి పరిస్థితిలో, మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ రిడింప్షన్ కు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్ రిడింప్షన్  ఎలా చేయాలి? దీనికున్న.. 3 సూత్రాల ఫార్ములా ఏమిటి?

రీమా చాలా కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. స్టాక్ మార్కెట్‌లోని ఒడిదుడుకులను చూసి, ఇప్పుడు ఈ పెట్టుబడిని రీడీమ్ చేయడం అంటే డబ్బును వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. రీమా మాత్రమే కాదు, ఆమె లాంటి చాలా మంది మార్కెట్‌లోని అస్థిరతను చూసి.. వారి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను రీడీమ్ చేసుకోవడం గురించి ఆలోచించడం ప్రారంభించారు.. అయితే ఇది సరైనదేనా?

మీరు మీ నిధులను ఎప్పుడు రిడీమ్ చేసుకోవాలి? ఎప్పుడు చేయకూడదు?

అన్నింటిలో మొదటిది, రిడింప్షన్ ప్రాసెస్ ను అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు సుదీర్ఘమైన ఫారమ్‌లను నింపాల్సిన అవసరం లేదు. మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని రీడీమ్ చేయడానికి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. అంటే AMC కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. డిజిటలైజేషన్ తర్వాత, ఈ ఇన్వెస్ట్ మెంట్ రిడీమింగ్ ప్రక్రియ మారింది. చాలా సులభం. ఇప్పుడు మీరు కేవలం ఒక క్లిక్‌తో NAVని.. అంటే మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో రిడెంప్షన్ అనేది స్కీమ్ నుండి బయటకు వచ్చేయడానికి లేదా యూనిట్‌లను పాక్షికంగా రీడీమ్ చేయడానికి ఉపయోగించే పదం. ఈ వీడియోలో మీరు మీ మ్యూచువల్ ఫండ్‌ని సులభంగా రీడీమ్ చేసుకునే కొన్ని మార్గాలను తెలియజేస్తాం.

మొదటి, ఇంకా సులభమైన మార్గం AMC లేదా డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిడీమ్ చేయడం. ఈ రోజుల్లో చాలా మంది పెట్టుబడిదారులు నేరుగా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి లేదా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మ్యూచువల్ ఫండ్‌లను కొనుగోలు చేస్తారు. అన్ని AMCలు తమ వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్‌లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి తగిన సదుపాయాన్ని అందిస్తున్నాయి. పంపిణీదారులు కూడా ఇలాంటి ఆప్షన్ ను అందిస్తున్నారు. వీటి ద్వారా మీరు మీ పెట్టుబడిని సులభంగా రీడీమ్ చేసుకోవచ్చు. మీరు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే… మీరు ఎప్పుడైనా మీ యూనిట్లను విక్రయించడానికి ఆర్డర్ చేయవచ్చు. అందుకు బదులుగా వచ్చిన మొత్తం.. మీ డీమ్యాట్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ అవుతుంది.

మీరు రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్.. అంటే RTA ద్వారా కూడా మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు కార్వీ, CAMS వంటి RTAలను సంప్రదించాలి. RTA ఆన్‌లైన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి లేదా AMC సమీప శాఖను సందర్శించి.. మ్యూచువల్ ఫండ్స్ ను రిడీమ్ చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్‌లను రీడీమ్ చేయడానికి AMC లేదా బ్రోకర్ ప్రక్రియలో తేడా ఉండవచ్చని గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్‌లను రీడీమ్ చేయడంపై ఖచ్చితమైన సమాచారం కోసం, AMC అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.

మ్యూచువల్ ఫండ్స్‌ను ఎప్పుడు రిడీమ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రశ్న. మూడు పరిస్థితులను గుర్తుంచుకోండి – మొదటిది, మీకు డబ్బు అవసరమైనప్పుడు, నిధులు ఎక్కడి నుండైనా అందుబాటులో ఉండవు. రెండవది, మీ ఫండ్ వ్యూహం మారితే… ఇక మూడవది, మీ ఫండ్ పనితీరు బాగా లేకపోతే. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ మ్యూచువల్ ఫండ్‌ను విక్రయించవచ్చు.

ఇన్వెస్టోగ్రఫీ ఫౌండర్. CFP అయిన శ్వేతా జైన్ ఏం చెప్పారంటే.. మ్యూచువల్ ఫండ్‌లను రీడీమ్ చేసే ముందు, మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. మీరు పెట్టుబడి పెట్టిన లక్ష్యాన్ని చేరుకున్నారా? సమాధానం అవును అయితే, మీరు పెట్టుబడిని రీడీమ్ చేసుకోవచ్చు. అదే విధంగా, మార్కెట్ అస్థిరత కారణంగా మీరు మీ పెట్టుబడి నుండి బయటకు వచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే, ఆ ప్రక్రియను అక్కడే ఆపేసి, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మార్కెట్ అస్థిరత శాశ్వతం కాదు. అటువంటి పరిస్థితిలో మీరు మీ పెట్టుబడి నుండి ఎగ్జిట్ అవ్వకూడదు.

మీరు కూడా మీ పెట్టుబడిని రీడీమ్ చేయాలనుకుంటే, తెలుసుకోవలసిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి.
– ఫండ్ పనితీరు, రిడింప్షన్ కు గల కారణాలను జాగ్రత్తగా పరిశీలించండి.
– మార్కెట్ ఒడిదుడుకుల మధ్య తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఫండ్ మేనేజర్ నిర్ణయాలను నమ్మండి.
– రిడింప్షన్ తర్వాత, ఖాతాలో డబ్బు జమ కావడానికి 1-2 రోజులు పట్టవచ్చు. ఈ సమయం ఫండ్ కేటగిరీని బట్టి ఉంటుంది. డెట్, లిక్విడ్ ఫండ్‌లలోని డబ్బు ఈక్విటీ ఫండ్ల కంటే త్వరగా వస్తుంది.
– ఎగ్జిట్ లోడ్ వంటి ఛార్జీల గురించి తెలుసుకోండి, ఎందుకంటే ఇవి ఫండ్‌ను బట్టి మారవచ్చు.

ఇటువంటి పరిస్థితిలో, మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ రిడింప్షన్ కు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో పన్నుకు సంబంధించిన విషయాలను మర్చిపోవద్దు. చాలా సార్లు డబ్బు అవసరం లేదా మెరుగైన పెట్టుబడి పెట్టాలనే కోరిక కారణంగా ప్రజలు రిడింప్షన్ కు వెళతారు. మీ మ్యూచువల్ ఫండ్‌ను విక్రయించడంలో మీరు కన్ఫ్యూజ్ అయితే.. మీరు ఫైనాన్షియల్ ప్లానర్ నుండి సలహా తీసుకోవచ్చు.

Published: March 26, 2024, 17:54 IST