విదేశీ చదువులకు ఆస్తి తాకట్టు పెట్టకుండానే లోన్ తీసుకోవచ్చు.. ఎలా అంటే..!

విద్యార్థికి హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. కో-అప్లికెంట్ క్రెడిట్స్కోర్ 600 పైన ఉండాలి

విదేశీ చదువులకు  ఆస్తి తాకట్టు పెట్టకుండానే లోన్ తీసుకోవచ్చు.. ఎలా అంటే..!

మీనల్ మాస్టర్స్ చదవడానికి అమెరికా వెళ్లాలి. బోస్టన్‌లోని యూనివర్సిటీ నుండి అడ్మిషన్ కోసం ఉత్తరం కూడా
వచ్చింది. కానీ ఆమె ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి ఇబ్బంది పడుతోంది. సమస్య ఏమిటంటే వారికి తాకట్టుగా
పెట్టడానికి పెద్ద ఆస్తి ఏమీ లేదు. చాలా మంది విద్యార్థులు మీనాల్ వంటి సమస్యతో బాధపడుతున్నారు. విదేశాలలో
చదువుకోవాలనే కల చాలా బాగుంటుంది. కానీ దీని కోసం డబ్బును సేకరించడం చాలా కష్టం . ప్రత్యేకించి మీరు
రుణం కోసం తాకట్టుగా ఇల్లు లేదా భూమి వంటి విలువైన ఆస్తిని కలిగి ఉండాలి. అలా లేకపోయినా
చదువుకోవచ్చు. అదే నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్. ఇది విద్యార్థులకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. దీని
కోసం, మీరు ఏదైనా తనఖా పెట్టకుండా కూడా విదేశాల్లో చదువుల కోసం లోన్ తీసుకోవచ్చు.

ముందుగా నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమిటో చూద్దాం. నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్ అంటే…
రుణానికి బదులుగా మీరు బ్యాంకుకు ఏమీ తాకట్టు పెట్టనవసరం లేదు. ఈ లోన్‌లు అనేక విషయాల ఆధారంగా
ఇస్తారు. విద్యార్థి అకడమిక్ రికార్డ్, అతను అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న కోర్సు, చదువు తర్వాత భవిష్యత్తులో
ఉద్యోగ అవకాశాలు వంటివి చూస్తారు. నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్, కొలేటరల్ లోన్ మధ్య కొన్ని తేడాలు
ఉన్నాయి.

నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్‌లో, పూచీకత్తు ఉండదు. అందుకే కొలేటరల్ లోన్‌తో పోలిస్తే ఈ లోన్ మొత్తం
తక్కువగా ఉండవచ్చు. వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే తాకట్టు లేకపోవడం వల్ల, బ్యాంక్‌కి
రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అటువంటి రుణాల వడ్డీ రేట్లు 10.5% నుండి 14% మధ్య
ఉంటాయి.అయితే, ఒక మంచి విషయం ఏమిటంటే, నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్‌కు డాక్యుమెంటేషన్ తక్కువ.
పైగా ఇది సులభంగా, త్వరగా అందుబాటులోకి వస్తుంది.

ఈ లోన్ కోసం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.

దీని కోసం మీరు ఆన్‌లైన్ ఆప్లికేషన్ ను ఫైల్ చేయవచ్చు. మీరు బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి.. దీని గురించి ఎంక్వైరీ
చేసి.. అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌ని కూడా సంప్రదించవచ్చు. ఆయన మీకు సహాయం
చేస్తారు. కానీ ఈ లోన్ కోసం కొన్ని అర్హతలు కావాలి. అవేమిటో చూద్దాం.

విద్యార్థికి హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. కో-అప్లికెంట్ క్రెడిట్
స్కోర్ 600 పైన ఉండాలి. కో-అప్లికెంట్ నెలవారీ ఆదాయం రూ. 35,000 పైన ఉండాలి. ఎటువంటి EMI లు
ఉంకూడదు. కో-అప్లికెంట్ 3 సంవత్సరాల ITR లేదా 2 సంవత్సరాల ఫారమ్ 16 ఇవ్వవలసి ఉంటుంది.
కో-అప్లికెంట్ కుటుంబ సభ్యుడు అయి ఉండాలి. అంటే తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి భర్త లేదా భార్య అయి
ఉండాలి. ఈ లోన్.. మాస్టర్స్ కోర్సులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆమోదించిన కోర్సుకు మీ దగ్గర
తప్పనిసరిగా అడ్మిషన్ లెటర్‌ ఉండాలి. ఆ విశ్వవిద్యాలయం లేదా కాలేజీ… బ్యాంకు ఆమోదించిన జాబితాలో
ఉండాలి.

నాన్-కొలేటరల్ ఎడ్యుకేషన్ లోన్ గురించి బాగా మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాం. మీకు కూడా విదేశాల్లో
చదవాలనే కల ఉంటే… ఈ లోన్ సహాయంతో మీరు దాన్ని నెరవేర్చుకోవచ్చు.

Published: March 11, 2024, 18:21 IST