బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఒక్కసారి.. ఈ వీడియో చూడండి!

మీరు ఓ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పెట్టుబడి కోసం ఇన్సూరెన్స్‌లో డబ్బు పెట్టవద్దు. మ్యూచువల్ ఫండ్స్,

బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఒక్కసారి..  ఈ వీడియో చూడండి!

గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేసి పదవీ విరమణ చేసిన మహేష్ చౌహాన్, రిటైర్ మెంట్ తరువాత కంపెనీ
నుండి చాలా పెద్ద మొత్తంలో బెనిఫిట్స్ అందుకున్నారు. ఈ నిధులను ఇన్వెస్ట్ చేయడానికి ఏఏ మార్గాలు ఉన్నాయో
వెదుకుతున్నారు. దీనికోసం బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మేనేజర్ వాటన్నింటిని ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్‌లో పెట్టమని
సలహా ఇచ్చాడు. పాలసీకి సంబంధించిన అనేక ప్రయోజనాలను గురించి మేనేజర్ వివరించారు. అందువల్ల, బ్యాంక్
మేనేజర్ సలహా ఆధారంగా, మహేష్ ఆ పాలసీని కొనుగోలు చేశారు. కానీ ఆ తరువాత ఆ పాలసీ తనకు ఏమాత్రం
ఉపయోగకరంగా లేదని తెలుసుకున్నాడు. తాను మోసపోయానని మహేశ్ కు అర్థమైంది. తప్పుడు సమాచారంతో ఆ
పాలసీని మహేశ్ కు అంటగట్టారు.

ఈ రోజుల్లో, ఇన్సూరెన్స్ ఏజెంట్ల తప్పుడు సమాచారం ద్వారా పాలసీలను విక్రయించడం గురించి మనం చాలా
ఫిర్యాదులను వింటున్నాం. ఇలాంటి బీమా తప్పుడు విక్రయాన్ని అడ్డుకోవడానికి, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయిన
IRDA.. ఇప్పుడు 55 ఏళ్లకు పైబడిన వారి కోసం రూపొందించిన బీమా పాలసీల పరిశీలనను వేగవంతం చేయడం
ద్వారా ముందడుగు వేసింది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు రెండూ ఇందులో చేర్చారు.

ఇన్సూరెన్స్‌ని తప్పుగా విక్రయించే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇటీవల,
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఇక్కడ,
వారు బీమా పాలసీలను విక్రయించేటప్పుడు ఆ ప్రాసెస్ ను వీడియో, ఆడియో రూపంలో రికార్డింగ్ చేయడం వంటి
వివిధ ఆప్షన్స్ పై చర్చించారు. ఇది బీమా పాలసీని కస్టమర్ కు విక్రయించేటప్పుడు అతడు చేసిన ప్రామిస్ లు
అన్నింటినీ అధికారికంగా రికార్డ్ చేయడం కోసమే.

దేశంలో బీమాను విక్రయించడంలో ప్రస్తుతం తొమ్మిది బ్యాంకులు కార్పొరేట్ ఏజెంట్లుగా ఉన్నాయి. 2022-23 ఆర్థిక
సంవత్సరంలో, జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియంలకు 17.44%, జీవితేతర బీమాకు 5.93% బ్యాంకులు
అందించాయి. బ్యాంకుల్లో బీమాను విక్రయించే డిపార్ట్‌మెంట్‌ని బ్యాంకాస్యూరెన్స్‌గా సూచిస్తారు. ఈ డిపార్ట్‌మెంట్‌తో
లింక్ అయి ఉన్న ఉద్యోగులకు.. పాలసీలను విక్రయించడంలో భారీ టార్గెట్లు ఉంటాయి. అందువల్ల, వారు ఈ
లక్ష్యాలను సాధించడానికి అన్ని రకాల పద్ధతులను ఫాలో అవుతారు.

ఏ కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఉద్యోగులకు బాగా తెలుసు.
అందువల్ల, వారు ఏదో ఒక రూపంలో ఇన్సూరెన్స్ ను వాళ్లకు అమ్ముతారు. బీమాను విక్రయించినందుకు బ్యాంక్
ఉద్యోగులు ఇన్సెంటివ్స్ ను అందుకుంటారు. ఇది ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ కేసులను మరింత పెంచుతుంది.

ఇప్పుడు, ఈ మిస్-సెల్లింగ్‌ను ఎలా నిరోధించాలనేది పెద్ద ప్రశ్న. జీవిత బీమా.. మీ ఆర్థిక భద్రత కోసం అని బాగా అర్థం
చేసుకోవడం.. ఇందులో ఫస్ట్ స్టెప్. దీన్ని ఎప్పుడూ పెట్టుబడి మార్గంగా చూడకూడదు. జీవిత బీమా ఎండోమెంట్
ప్లాన్‌లలో పెట్టుబడిపై సగటు వార్షిక రాబడి కేవలం 5-6% మాత్రమే. ఇది ద్రవ్యోల్బణాన్ని కూడా అధిగమించలేదు.
కాబట్టి ఒక బ్యాంక్ ఉద్యోగి లేదా ఏజెంట్.. పెట్టుబడి కోసం బీమాను కొనుగోలు చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు,
వారిని నమ్మవద్దు. ఎప్పుడూ వేరే ఎక్స్ పర్ట్స్ నుండి సెకండ్ ఒపీనియన్ ను తీసుకోండి.

మీరు ఏ పాలసీని కొనుగోలు చేస్తున్నారో దాని లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకోండి. పాలసీ పదాలను జాగ్రత్తగా
చదవండి. ఆ తర్వాత మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. మీకు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు
ఉన్నట్లయితే, బీమా పాలసీని కొనుగోలు చేయడం అంత కరెక్ట్ కాదు. బీమాలో.. వయస్సు పెరిగేకొద్దీ, కవర్ కోసం
చెల్లించాల్సిన మీ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇది మొత్తం రాబడిని గణనీయంగా తగ్గిస్తుంది.

SEBI-రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, బీమా తప్పుగా అమ్మడాన్ని అడ్డుకోవడానికి..
IRDA ఒక మంచి పని చేసింది. సాధారణంగా, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల బ్యాంక్
ఖాతాలలో ఎక్కువ డబ్బు ఉంటుంది. దీని వల్ల వారు మిస్ సెల్లింగ్ కు ఈజీగా టార్గెట్ అవుతారు. SEBI, ఆర్థిక
మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవడం వల్ల, బీమా ఏజెంట్లు, బ్యాంకుల జవాబుదారీతనం ఖచ్చితంగా పెరుగుతుంది.
ఇప్పుడు, వారు బీమా పాలసీలను మిస్ సెల్లింగ్ చేసే ముందు వందసార్లు ఆలోచించాలి. ఇది ఇన్సూరెన్స్ మిస్-సెల్లింగ్
కేసులకు ఖచ్చితంగా చెక్ పెడుతుంది.

మీరు ఓ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పెట్టుబడి కోసం ఇన్సూరెన్స్‌లో డబ్బు పెట్టవద్దు. మ్యూచువల్ ఫండ్స్,
చిన్న పొదుపు పథకాలు, FDలు.. ఇవి మంచి పెట్టుబడి మార్గాలు. ఎందుకంటే మీరు వాటి నుండి మంచి రాబడిని
అందుకోవచ్చు. పైగా మీ నిధులు లిక్విడ్‌గా లేదా సులభంగా తీసుకునేలా అందుబాటులో ఉంటాయి. మీరు కష్టపడి
సంపాదించిన డబ్బును తిరిగి పొందడానికి.. బీమా పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం
ఉండదు. అందుకే అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి.

Published: March 2, 2024, 17:42 IST