బడ్జెట్ లో ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉంటే సూపర్!

మూడో హామీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లేదా 15 లక్షలకు బీమా సౌకర్యం పెంచడం. చికిత్స ఖర్చు రోజురోజుకూ

ఆసుపత్రిలో వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్ కు ఊపిరి ఆడడం లేదు. డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. అతను ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేరు. అలాగని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పరిస్థితి చూస్తే.. రోగుల వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దది ఉంది.

రాధేశ్యామ్ ఆయుష్మాన్ పరిధిలోకి వచ్చేంత పేదవాడు కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులను భరించేంత ధనవంతుడు కాదు.
మధ్యతరగతి సంక్షోభం తీవ్రమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 11 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. రోజురోజుకూ రాధేశ్యామ్ ఆరోగ్యం క్షీణిస్తూ అతని ఆశలు సన్నగిల్లుతున్నాయి.

త్వరలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రకటించబోతోందని ఆయనకు తెలిసింది. ఈ బడ్జెట్ ఎన్నికల ఆధారంగా ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రభుత్వం కొన్ని పెద్ద ప్రకటనలు చేయడం ద్వారా తన ఉద్దేశమేంటో చెప్పచ్చు. ఇక్కడ రాధేశ్యామ్… ప్రభుత్వం నుంచి కొన్ని హామీలను ఆశిస్తున్నారు.

ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ కార్డు సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం మధ్యతరగతి కుటుంబాల నుంచి కొంత పేమెంట్ తీసుకున్నా.. కనీసం.. చికిత్స భారం అయినా తగ్గుతుంది. ప్రస్తుతం, ఈ పథకం 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు అంటే దాదాపు 55 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది.

రెండవ హామీ… ఆయుష్మాన్ కార్డును పొందిన తర్వాత చికిత్స. రాధేశ్యామ్‌కు పరిచయమున్న పలువురికి ఆయుష్మాన్ కార్డులు ఉన్నాయి. కానీ వాటితో చికిత్స పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఆసుపత్రులు ఆయుష్మాన్ స్కీమ్ తో అసోసియేట్ అవ్వలేదు. కారణం.. ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం వర్తించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డు నిరుపయోగంగా మారుతోంది.

మూడో హామీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లేదా 15 లక్షలకు బీమా సౌకర్యం పెంచడం. చికిత్స ఖర్చు రోజురోజుకూ పెరుగుతోంది. ఔషధాలు, శస్త్రచికిత్సల ద్రవ్యోల్బణం… ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా ఎక్కువ.

డిసెంబరులో ఆహార ద్రవ్యోల్బణం రేటు 9.5 శాతం కాగా, వైద్య ఖర్చుల ద్రవ్యోల్బణం 14 శాతంగా ఉంది…

అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు రూ.10-15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్ పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే తన తాలూకాకు చెందిన పిఎసి కూడా కొంత మెరుగుపడాలని రాధేశ్యామ్ కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 24 గంటలూ డాక్టర్ల లభ్యత, చికిత్స కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అంబులెన్స్, ఔషధాల లభ్యత గురించీ బడ్జెట్ లో హామీ ఇవ్వాలి. దీనివల్ల ప్రైవేట్ ఆసుపత్రులపై సామాన్యుడు ఆధారపడటం తగ్గుతుంది.

ఈ సంవత్సరం రాధేశ్యాం ఆరోగ్య సంబంధిత పథకాల గురించి మాత్రమే ఎదురుచూస్తున్నారు.

Published: January 30, 2024, 14:47 IST

బడ్జెట్ లో ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉంటే సూపర్!