టాక్స్ సేవింగ్స్ కోసం ఈ పథకం బెస్ట్

2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 నెలలు గడిచాయి. టాక్స్ సేవింగ్స్ కోసం మీరు ప్లానింగ్ ప్రారంభించకపోతే దానిని వెంటనే మొదలు పెట్టండి

ఎందుకంటే, అప్పటికప్పుడు టాక్స్ సేవింగ్స్ ప్లాన్ చేయడం.. దానికోసం ప్రయత్నం చేయడం వంటివి కొంచెం క్లిష్టంగా ఉంటాయి

ఎందుకంటే, అప్పటికప్పుడు టాక్స్ సేవింగ్స్ ప్లాన్ చేయడం.. దానికోసం ప్రయత్నం చేయడం వంటివి కొంచెం క్లిష్టంగా ఉంటాయి

అందుకే ఇప్పటి నుంచే టాక్స్ సేవింగ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని వాటిని ప్రారంభించడం మంచిది

టాక్స్ సేవింగ్స్ తో పాటు మన ఇన్వెస్ట్మెంట్ పై మంచి రాబడి అందించే ఒక స్కీం గురించి స్కీం గురించి తెలుసుకుందాం

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటే ELSS టాక్స్ సేవింగ్స్ తో పాటు మన ఇన్వెస్ట్మెంట్ పై మంచి రాబడి అందిస్తుంది

ELSS కేటగిరీలోని చాలా ఫండ్‌లు గత ఒక్క  సంవత్సరంలో 26% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి

మీరు ELSS పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు

ఇక ELSS లో 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అంటే, మీరు దీనిలో పెట్టుబడి పెట్టిన డబ్బు 3 సంవత్సరాల తర్వాత మాత్రమే విత్‌డ్రా చేయగలుగుతారు

 ఇతర పథకాలతో పోలిస్తే దీని లాక్-ఇన్ వ్యవధి చాలా తక్కువ. అయితే, లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా దీన్ని కొనసాగించవచ్చు

ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడిని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ. 500 నుంచి తక్కువ ఎమౌంట్ తో   కూడా ప్రారంభించవచ్చు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టే బదులు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే సిప్ ద్వారా పెట్టుబడి పెట్టాలి

SIP ద్వారా, మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టండి. దీనివలన రిస్క్ ఫాక్టర్ తగ్గుతుంది.  ఎందుకంటే ఇది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కి ఎక్కువగా ప్రభావితం కాదు

టాక్స్ సేవింగ్స్ ప్లాన్ గురించి ఆలోచించే ముందు మీ ఆర్థిక సలహాదారుని సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది