STP విధానంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసా?

ఒక్కోసారి ఏదైనా వ్యాపారం వ్యవహారంలో ఎక్కువ డబ్బు రావచ్చు. అటువంటప్పుడు సురక్షితంగా డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టె ఆలోచన చేయవచ్చు 

ఎవరికైనా పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బును ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందులోనూ ఈక్విటీ ఫండ్స్ లో పెడితే అది చాలా రిస్క్ తో ఉంటుంది

అటువంటి భయం లేకుండా ఉండాలంటే రిస్క్ తక్కువతో లాభాన్ని పొందాలి అనుకుంటే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మార్గం ఉంది. అదే STP విధానం 

సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా, అంటే STP ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ విధానంలో  మొత్తం డబ్బు ఒకేసారి నేరుగా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ అవదు

ముందుగా, మొత్తం డబ్బు డెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.  ఆ తర్వాత, అది క్రమంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కి STP ద్వారా ముక్కలుగా బదిలీ చేస్తారు

మొదట ఈ డబ్బును డిపాజిట్ చేసిన పథకాన్ని మూల పథకం అంటే సోర్స్ స్కీం అంటారు. దీని తరువాత డబ్బు ట్రాన్స్ఫర్ చేసే పథకాన్ని టార్గెట్ స్కీం అంటారు

STP మ్యూచువల్ ఫండ్  ఒక స్కీమ్ నుంచి డిపాజిట్ చేసిన మొత్తాన్ని దాని మరొక స్కీమ్‌కు క్రమశిక్షణతో బదిలీ చేస్తుంది

దీని వ్యవధి సాధారణంగా 6 నెలలు, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు… ఇన్వెస్టర్‌లు ఎన్నిసార్లు తమ డబ్బును బదిలీ చేయాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం కూడా ఉంది

STPలు నిజానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు లేదా మ్యూచువల్ ఫండ్  SIPల వంటివి

ఒకే తేడా ఏమిటంటే, STP కింద, డబ్బు ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కి బదిలీ చేస్తారు

అయితే SIPలలో, డబ్బు పెట్టుబడిదారుడి బ్యాంక్  ఎకౌంట్  నుంచి ఫండ్ హౌస్‌కి వెళుతుంది

మీరు STPల ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు ఎంట్రీ లోడ్ ఉండదు. దీని అర్థం మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు

అయితే, మీరు యూనిట్లను విక్రయించినప్పుడు, పెట్టుబడి విలువలో 2% వరకు ఎగ్జిట్ లోడ్ విధిస్తారు.  

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తప్పనిసరిగా టార్గెట్ స్కీం కు  కనీసం 6 సార్లు నిధులను బదిలీ చేయాలి. అయితే ఈ బదిలీలకు గరిష్ట పరిమితి లేదు