జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 భార్యాభర్తలే కాకుండా కుటుంబ నిర్వహణలో పాలుపంచుకునే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కూడా జాయింట్‌ అకౌంట్‌ను తీయవచ్చు

ఇద్దరూ తమ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని అందులో జమ చేస్తారు. ఇంటితో ముడిపడిన ప్రతి ఖర్చు ఆ ఖాతా నుంచే చెల్లిస్తారు

అద్దె, సరుకులు, సినిమాలు, బిల్లులు, సమస్తం ఇక్కడి నుంచే చెల్లింపులు జరిపితే నెలకు ఇంత ఖర్చు అవుతుందన్న లెక్క ఉంటుంది

ఎమర్జెన్సీ ఫండ్‌ కోసం కూడా జాయింట్‌ అకౌంట్‌ పనికొస్తుంది. ఆ మేరకు బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు

జాయింట్‌ అకౌంట్‌ ప్రారంభించడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక ఆప్షన్‌ ఎంచుకుంటే లావాదేవీల నిర్వహణకు ఇద్దరు సంతకాలు కావాలి

 అదే ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా బతికున్నవారు అనే ఆప్షన్‌ ఎంచుకుంటే ఖాతాలోని ప్రతి భాగస్వామికి విత్‌డ్రా అధికారాలు ఉంటాయి

దుదృష్టవశాత్తు, ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా కూడా మిగిలినవారికి ఆఖాతాలో సొమ్ము మీద అధికారం ఉంటుంది