ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు ఎందుకు తిరస్కరిస్తారో తెలుసా?

ఆరోగ్య బీమా విషయంపై సంచలన నివేదికను పాలసీ బజార్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసింది

పాలసీ బజార్‌ ప్రకారం 75 శాతం కేసులలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపింది

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లలో 18 శాతం వెయింటింగ్‌ పీరియడ్‌ని దాటకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి

16 శాతం కేసులలో ప్రజలు కవరేజీతో నిమిత్తం లేకుండానే ఉండే వ్యాధుల కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ దావా వేస్తున్నారు

 ఓపీడీ, డేకేర్‌ కోసం 9 శాతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు చేయడం జరిగిందని నివేదిక తెలిపింది

4.5 శాతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు తప్పుగా ఫైల్‌ చేసినట్లయితే తిరస్కరణకు గురవుతున్నట్లు గుర్తించింది

 పరిమితిని చేరుకున్నందున 2.12 శాతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు ఆమోదానికి నోచుకోవడం లేదని పాలసీ బజార్‌ పేర్కొంది

.గరిష్టంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ 25 శాతం తిరస్కరణకు కారణం పాత వ్యాధులను దాచడమేనని పాలసీ బజార్‌ నివేదిక తెలిపింది