వాట్సాప్ ద్వారా ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు తెలుసా?

ట్రైన్ లో దూర ప్రయాణం చేసినపుడు ఫుడ్ కోసం చాలా ఇబ్బందులు ఉంటాయి

ట్రైన్ పాంట్రీలో ఫుడ్ తినడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది చాలా మందికి

అందుకే మంచి ఫుడ్ జర్నీలో దొరికితే మజానే వేరుగా ఉంటుంది అనుకోవడం సహజం

అలాంటి ఫుడ్ ప్రియుల కోసం ఇండియన్ రైల్వేస్ ఓ మంచి సదుపాయం తీసుకు వచ్చింది

జర్నీలో మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడాన్ని మరింత ఈజీగా చేయడానికి వాట్సాప్ ద్వారా సర్వీసులు పొందే అవకాశం కల్పిస్తోంది 

ఈ కేటరింగ్ సర్వీసులను మరింత ఈజీగా చేయడానికి ముందు కొన్ని ఎంపిక చేసిన ట్రైన్స్ లో ఈ సర్వీస్ తీసుకువచ్చింది 

ఐఆర్‌సీటీసీ ఇప్పటికే  www.ecatering.irctc.co.in, ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ అనే యాప్‌ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది

ఇప్పుడు వాట్సాప్ నెంబర్ 87500 01323 కూడా అందుబాటులోకి తెచ్చింది

టికెట్ బుక్ చేసిన వెంటనే ఈ వాట్సాప్ నెంబర్ నుంచి ఒక లింక్ వస్తుంది

అక్కడ ప్రయాణీకులు తమకు అందుబాటులో ఉన్న స్టేషన్ లోని తమకు నచ్చిన రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు

అప్పుడు  ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ ఈ కేటరింగ్‌కు సంబంధించిన సేవలను నేరుగా అందిస్తుంది.

కాగా  జూప్‌ అనే థర్డ్‌పార్టీ ఆన్‌లైన్‌ పుడ్‌ ప్లాట్‌ఫాం గతేడాదే వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా రైళ్లలోకి ఆహారాన్ని అందించే సర్వీసులను స్టార్ట్ చేసింది