లాకింగ్ పిరియడ్ లేని FD..  SBI అందిస్తున్న అమృత్-కలశ్

డబ్బు దాచుకోవాలి అని ఎవరైనా అనుకున్నపుడు మొదట గుర్తువచ్చేది FD

అయితే, దీనిలో ఉండే లాక్-ఇన్ పిరియడ్ అందులో డిపాజిట్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది

 అత్యవసరం అయితే.. దాని బ్రేక్  చేసుకుంటే కొంత పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది

లాక్-ఇన్ పీరియడ్ లేని FD స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS)

ఈ పథకం వల్ల రెండు పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా, ఇందులో మీరు FDకి సమానమైన వడ్డీని పొందుతారు

రెండవది, ఇందులో మీ డబ్బు ఎప్పుడూ లిక్విడ్‌గా ఉంటుంది, అంటే, మీరు ఎటువంటి పెనాల్టీ చెల్లించకుండా FD మెచ్యూరిటీకి ముందే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు

సేవింగ్స్ ఎకౌంట్  లాగా, మీరు ATM  లేదా,  చెక్ ద్వారా  బ్రాంచ్‌కి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు

ఇది మీ సేవింగ్స్ ఎకౌంట్ లేదా కరెంట్ ఎకౌంట్ తో  లింక్ చేయడం ద్వారా మీరు ఓపెన్ చేయగలిగిన టర్మ్ డిపాజిట్ పథకం

మీరు మీ డిపాజిట్ నుంచి రూ. 1000  గుణకాలలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు

మీకు కావలసినప్పుడు ఈ పథకం నుంచి  మీకు కావలసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.  మీరు మీకు కావలసినన్ని సార్లు డబ్బు తీసుకోవచ్చు

దీని నుంచి  వచ్చే వడ్డీ మొత్తంపై, మీరు ప్రస్తుత రేటు ప్రకారం సోర్స్ వద్ద పన్ను మినహాయింపు అంటే TDS చెల్లించాలి

ఆటో స్వీప్ కోసం కనీస థ్రెషోల్డ్ బ్యాలెన్స్ రూ. 35,000. కనిష్ట రిజల్ట్ బ్యాలెన్స్ రూ. 25,000

SBI అమృత్ కలశ్ ‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని పొడిగించింది

1 డిసెంబర్ 2023 వరకు ఇందులో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డిపై 7.60% వార్షిక వడ్డీ.. ఇతరులకు 7.10% వార్షిక వడ్డీని ఇస్తారు