మారిన  బ్యాంక్ లాకర్ రూల్స్ తెలుసుకోండి

చాలామంది బ్యాంకులో లాకర్ తీసుకుని తమ విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ జాగ్రత్త చేసుకుంటారు

దాదాపుగా అన్ని బ్యాంకులు ఈ లాకర్ సదుపాయాన్ని అందిస్తున్నాయి

బ్యాంక్ లాకర్ కి సంబంధించి కొత్త రూల్స్ తెచ్చింది ఆర్బీఐ

ఆర్బీఐ 2023 డిసెంబరు 31 తేదీ నాటికి లాకర్‌ ఒప్పందాల రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది 

లాకర్‌ ఒప్పందం స్టాంప్‌ పేపర్‌పై ఉండాలని ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది 

బ్యాంకులు కస్టమర్లకు అగ్రిమెంట్ కాపీని అందించాలి. రెండు పార్టీలు సైన్ చేసిన లాకర్‌ అగ్రిమెంట్ కు  సంబంధించిన కాపీని 'లాకర్‌-హైరర్‌'కు బ్యాంకు అందిస్తుంది

బ్రాంచ్‌లలో బ్యాంకు వెబ్‌సైట్‌లో అన్ని నిబంధనలు, SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను తప్పనిసరిగా డిస్ల్పే చేయాలి

లాకర్ తీసుకోవడానికి బ్యాంకులు మూడేళ్ళ లాకర్ అద్దె చార్జీలను FDగా ఉంచాలని కోరవచ్చు. ఇందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది

లాకర్‌ తీసుకున్నవారు లాకర్‌ను ఆపరేట్‌ చేయకపోయినా లేదా చార్జీలు చెల్లించకపోయినా ఈ డిపాజిట్ నుంచి రికవరీ చేస్తారు 

భారీ వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు, తీవ్రవాదుల దాడి, అల్లర్లలో ఇబ్బందుల వల్ల లేదా లాకర్‌ తీసుకున్నవారి నిరక్ష్యం కారణంగా లాకర్‌లోని వస్తువులు చెడిపోయినా/దెబ్బతిన్నా.. లాకర్‌లో ఉన్న వస్తువులకు బ్యాంకు బాధ్యత వహించదు

అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం లేదా ఉద్యోగుల మోసపూరిత కార్యకలాపాల వంటి సంఘటనల విషయంలో లాకర్‌ అద్దెదారునకు బ్యాంకు కాంపన్సేషన్ చెల్లిస్తుంది

ఈ కాంపన్సేషన్ లాకర్‌కు సంబంధించిన ప్రస్తుత వార్షిక అద్దెకు గరిష్ఠంగా 100 రెట్ల వరకు ఉండొచ్చు