సమయం మించిపోతుంది.. డీమ్యాట్ ఎకౌంట్ కు  నామినీని యాడ్ చేశారా? లేదా?

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాఋ అత్యవసరంగా చేయాల్సిన పని ఒకటి ఉంది

అది సెప్టెంబర్ 30 లోపు మీ డీమ్యాట్ ఎకౌంట్ కు నామినీని యాడ్ చేయడం

ఒకవేళ అలా చేయకపోతే అక్టోబర్ 1 నుంచి మీ ఎకౌంట్ బ్లాక్ అయిపోతుంది

నిజానికి ఈ గడువు ఈ ఏడాది మర్చి 31తో ముగిసింది. కానీ, సెబీ దీనిని సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది

చాలామంది డీమ్యాట్ ఎకౌంట్స్ కు నామినీని యాడ్ చేయడం లేదు

దీనివలన అనుకోని పరిస్థితిలో ఎకౌంట్ హోల్డర్ కు ఏదైనా జరిగితే,  పెట్టుబడులు, ఫండ్‌ యూనిట్లను వారసులు క్లెయిం చేసుకోవడం కష్టం అవుతుంది 

అందుకే సెబీ నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేసింది 

ఇండివిడ్యువల్ ఎకౌంట్ లేదా జాయింట్ ఎకౌంట్ ఏదైనా కానీ నామినీని చేర్చవచ్చు 

తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు ఇలా ఎవరినైనా నామినీగా నియమించవచ్చు

సొసైటీ, ట్రస్ట్‌, బాడీ కార్పొరేట్‌, భాగస్వామ్య సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం (Hindu Undivided Family)లోని వ్యక్తుల్ని నామినీగా ఎంచుకోకూడదు. 

గరిష్ఠంగా ముగ్గురు నామినీలను ఎంచుకోవచ్చు. ఇలా ఎంచుకొనే సమయంలో వారిలో ఒకొక్కరికి ఎంత మొత్తంలో షేర్లు చెందాలో కూడా అక్కడే మెన్షన్ చేయవచ్చు

ఎన్‌ఎస్‌డీఎల్‌ పోర్టల్‌లో నామినీని రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా నామినీని యాడ్ చేసుకోండి