ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఆస్తి పంపిణీ ఎలా? php // echo get_authors();
?>
ఆగ్రాకు చెందిన అమర్ సింగ్ కోట్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నాడు. ప్రతి నెలా వ్యవసాయం, వ్యాపారం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే అతను తన 6 ఏళ్ల దివ్యంగుడైన బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాడు. తనకు ఏమైనా అయితే..
ఆగ్రాకు చెందిన అమర్ సింగ్ కోట్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నాడు. ప్రతి నెలా వ్యవసాయం, వ్యాపారం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే అతను తన 6 ఏళ్ల దివ్యంగుడైన బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాడు. తనకు ఏమైనా అయితే తన బిడ్డను ఎవరు చూసుకుంటారు, కోట్ల రూపాయల ఆస్తిని ఎలా పంచుతారు అనేది అతని బాధ. అతను ఈ విషయంలో చాలా ఆందోళన చెందాడు. దాని గురించి ఏమి చేయాలో అర్థం చేసుకోలేకపోయాడు. అవును నిజమే.. దివ్యంగ పిల్లలతో ఉన్న కుటుంబాలు ఎస్టేట్ ప్లానింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఎస్టేట్ ప్లానింగ్‌లో, అంటే భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడి పెట్టడం, ఆస్తిని నిర్వహించడం అదేవిధంగా పంపిణీ చేయడం అని చెప్పవచ్చు. సాధారణ పిల్లలతో పోలిస్తే, దివ్యంగ పిల్లలకు వారి సంరక్షణ – విద్య కోసం మరింత ఆర్థిక సహాయం అవసరం. వారసత్వంగా వారికి మరిన్ని ఆస్తులు మిగిలిపోతే, ఆందోళనలు పెరుగుతాయి. అటువంటి పిల్లల జీవితకాల ఖర్చులు, సంరక్షకుల నియామకం, సభ్యుల మధ్య ఆస్తి విభజన అలాగే ఇతర కుటుంబ సభ్యుల అవసరాలు వంటివి తల్లిదండ్రులు టెన్షన్ లేకుండా జీవించలేని ఇబ్బందిని సృష్టిస్తాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో 2.68 కోట్ల (26.8 మిలియన్) మంది దివ్యంగులు ఉన్నారు. UNESCO – టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక ప్రకారం 2019 సంవత్సరంలో, భారతదేశంలో దాదాపు 7.8 మిలియన్ల మంది 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న దివ్యంగ పిల్లలు ఉన్నారు. అటువంటి పిల్లల కోసం ఎస్టేట్ ప్లానింగ్‌పై శ్రద్ధ చూపడం చాలా కీలకం ఎందుకంటే పూర్వీకుల ఆస్తిలో వాటాను క్లెయిమ్ చేయడం తరచుగా సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలను కలిగి ఉంటుంది. కుటుంబంలో ఆస్తి విభజనపై వివాదాలు కోర్టు కేసులు సంవత్సరాల తరబడి సాగే స్థాయికి చేరుకుంటాయి. పిల్లలకు వైకల్యం ఉంటే అది మరింత సవాలుగా మారుతుంది.
ఈ పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి ప్రత్యేక హక్కులు లేవు. ఏదైనా చట్టపరమైన అడ్డంకి వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. ఎస్టేట్ ప్లానింగ్ ద్వారా, పిల్లల సంరక్షణ వారి జీవితకాలంలో కొనసాగుతుందని మీరు నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు, ప్రశ్న ఏమిటంటే, ఏమి చేయవచ్చు? అనేది. తల్లిదండ్రులను చట్టబద్ధంగా తమ పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వరకు సంరక్షకులుగా పరిగణిస్తారు. బిడ్డ మైనారిటీ తీరిన తర్వాత, వారు స్వంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
అయినప్పటికీ, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు వారి జీవితాంతం తరచుగా మద్దతు అవసరమవుతుంది. అందుకే పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షకులుగా మారవలసి ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న తలెత్తుతుంది: తల్లిదండ్రుల తర్వాత పిల్లల సంరక్షణ – ఆస్తిని ఎవరు నిర్వహిస్తారు? దీని కోసం ఏర్పాట్లు ముందుగానే చేయాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరచుగా గణనీయమైన ఆర్థిక సహాయం అవసరమవుతుంది. ఈ సమయంలో ఇతర కుటుంబ సభ్యుల అవసరాలు విస్మరించే అవకాశం ఉంది.
అటువంటి పరిస్థితులలో, ఆస్తి విభజన, పిల్లల సంరక్షణ బాధ్యత – ఇతర ఆందోళనల గురించిన టెన్షన్స్ అర్హత కలిగిన న్యాయవాది సహాయంతో వీలునామాను రూపొందించడం ద్వారా పరిష్కరించవచ్చు. నిర్ణయాలు తీసుకునే అసమర్థత కారణంగా, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఆస్తి – నగదును నేరుగా కేటాయించడానికి తల్లిదండ్రులు వెనుకాడవచ్చు. ఈ ఆస్తుల నిర్వహణ కోసం వారు తగిన సంరక్షకుడిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక ప్రైవేట్ ట్రస్ట్‌ను స్థాపించడం ఈ ఆందోళనను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. ట్రస్ట్ ఎలా నిర్వహించాలీ? ఆదాయ పంపిణీని ఎలా చేయాలి వంటి విషయాలను జాగ్రత్తగా నిర్ణయించాలి. ఇవి ట్రస్ట్ డీడ్ని సృష్టించడం ద్వారా తల్లిదండ్రులు పరిష్కరించగల కొన్ని సమస్యలు. వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య – రోజువారీ అవసరాలను అందించడానికి గణనీయమైన మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది అన్నారు. ఈ ఖర్చులు చాలా వరకు వారి జీవితకాలంలో కవర్ చేయాలి అని చెప్పారు. కాబట్టి, పిల్లల కోసం ఎస్టేట్‌ను ప్లాన్ చేసేటప్పుడు, వారి జీవితకాల ఖర్చులను కవర్ చేయడానికి ఎంత డబ్బు సరిపోతుందో ముందుగా అంచనా వేయడం చాలా అవసరం అని అయన అంటున్నారు. మీ ప్రియమైన వ్యక్తి మీ తర్వాత నిధుల కొరతను ఎదుర్కోకుండా ఉండటానికి వీలైనంత త్వరగా మీ పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా దివ్యంగులైన పిల్లల భవిష్యత్ కోసం ప్లాన్ చేయడం ప్రారంభించండి.
Published September 17, 2023, 22:55 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.