ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై టాక్స్ ఎలా విధిస్తారు? php // echo get_authors();
?>
కొన్నాళ్లు పొదుపు చేసిన రోహన్ ఎట్టకేలకు ఇల్లు కొనగలిగాడు. కానీ అతనికి ట్రాన్స్ఫర్ కావడంతో వేరే నగరానికి మారాల్సి వచ్చింది. దీంతో ఒక పరిచయస్తుడు తన ఇల్లు ఖాళీగా ఉండకుండా అద్దెకు ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా, దీని నుంచి అద్దె ఆదాయాన్ని కూడా..
కొన్నాళ్లు పొదుపు చేసిన రోహన్ ఎట్టకేలకు ఇల్లు కొనగలిగాడు. కానీ అతనికి ట్రాన్స్ఫర్ కావడంతో వేరే నగరానికి మారాల్సి వచ్చింది. దీంతో ఒక పరిచయస్తుడు తన ఇల్లు ఖాళీగా ఉండకుండా అద్దెకు ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా, దీని నుంచి అద్దె ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు అని చెప్పాడు. రోహన్ కు ఈ సలహా నచ్చి, తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. మీరు కూడా అద్దె పై ఆదాయాన్ని సంపాదించడానికి మీ ఇంటిని కూడా అద్దెకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? సమాధానం అవును అయితే, పన్నులు చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. అద్దెకు తీసుకున్న ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై టాక్స్ ఎలా విధిస్తారు? అటువంటి ఆదాయంపై మీరు క్లెయిమ్ చేయగల పన్ను మినహాయింపులు ఏమిటి? తెలుసుకుందాం. అద్దె ద్వారా సాధారణ ఆదాయాన్ని సంపాదించగల సామర్థ్యం కారణంగా ప్రాపర్టీని సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా పరిగణిస్తారు. అయితే, ఈ అద్దె ఆదాయంపై టాక్స్ విధిస్తారు. అటువంటి ఆదాయం “ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం” హెడ్ కింద వర్గీకరించారు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం కేవలం ఇల్లు లేదా ఫ్లాట్ నుంచి అద్దెకు మాత్రమే కాదు, దుకాణాలు.. మరిన్నింటి నుంచి వచ్చే అద్దె ఆదాయాలు కూడా ఉంటాయి. మరిన్ని ఇంటి అద్దెతో సంపాదించే రోహన్ వంటి ఇంటి యజమానులు
తమ ఆస్తి స్థూల వార్షిక విలువ లేదా GAV గురించి అర్థం చేసుకోవాలి. అలాగే నికర వార్షిక విలువ, లేదా NAV గురించి కూడా తెలుసుకోవాలి. స్థూల వార్షిక విలువ అంటే మీరు మీ ఇంటి నుంచి సంవత్సరానికి అద్దెగా స్వీకరించే మొత్తం. కాబట్టి, రోహన్ నెలకు రూ. 20,000 అద్దెగా సంపాదిస్తున్నాడని అనుకుందాం. అప్పుడు అతను ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి నుంచి అద్దెగా రూ. 2,40,000 సంపాదిస్తాడు. ఇది ఇంటి స్థూల వార్షిక విలువ. కానీ, అక్కడ నివాసముంటూ హౌస్ టాక్స్ లేదా మున్సిపల్ టాక్స్ చెల్లించాలి. ఈ మునిసిపల్ టాక్స్ ను ఆస్తి స్థూల వార్షిక విలువ నుంచి తీసివేసిన తర్వాత, మనం దాని నికర వార్షిక విలువ అంటే NAV కి చేరుకుంటాము.
రోహన్ ఈ పన్ను కోసం సంవత్సరానికి రూ. 10,000 చెల్లిస్తాడు. కాబట్టి, ఆస్తి నికర వార్షిక విలువ రూ. 2,30,000. అవుంతుంది. జీతం ద్వారా వచ్చే ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ పొందినట్లే అద్దె ఆదాయంలో 30% స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. . ఇంటిని పునరుద్ధరించడం లేదా మరమ్మతు చేయడం కోసం ఈ మినహాయింపు అందిస్తారు. మీరు ఖర్చు చేశారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి నికర వార్షిక విలువ నుంచి ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను తీసివేసిన తర్వాత, రోహన్ ఇంటి ఆస్తినుంచి అతని ఆదాయానికి చేరుకుంటారు. అప్పుడు అది రూ. 1,61,000 అవుతుంది.
మీరు అద్దెకు తీసుకున్న ఇంటి కోసం మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, సెక్షన్ 24(B) కింద ఈ లోన్‌పై చెల్లించే వడ్డీపై మినహాయింపును మీరు క్లెయిమ్ చేయవచ్చు. మీరు క్లెయిమ్ చేయగల గరిష్ట తగ్గింపు మొత్తం రూ. 2,00,000. హోమ్ లోన్ అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడం సెక్షన్ 80C పరిధిలోకి వస్తుంది.హోమ్ లోన్ పై వార్షిక వడ్డీగా రోహన్ రూ. 1,00,000 చెల్లిస్తాడనుకుందాం. కాబట్టి, ఈ మొత్తం ఆస్తి నికర విలువ నుంచి తీసివేస్తారు. కాబట్టి, ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం ఇప్పుడు రూ. 61,000 అవుతుంది.
ఇప్పుడు, ఈ అద్దె ఆదాయంపై ఎలా పన్ను విధిస్తారో అర్థం చేసుకుందాం. అద్దె ఆస్తి లేదా ఇంటి ఆస్తి ఆదాయంను మీ ఆదాయానికి జోడించండి. ఆపై మీ వర్తించే ఆదాయ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. కాబట్టి, రోహన్ 20% ఆదాయ పన్ను స్లాబ్ కిందకు వస్తే, ఇంటి ఆస్తి ఆదాయం పై కూడా 20% పన్ను విధిస్తారు.
మీరు చెల్లించిన పన్ను కంటే ఎక్కువ సర్ఛార్జ్ – సెస్‌ని కూడా చెల్లించాలి. రోహన్ లాగా మీకు కూడా హౌస్ ప్రాపర్టీ ఉంటే, మీరు ITR-1 ఫైల్ చేయాలి. కొన్నిసార్లు, మీరు మీ ఇంటితో పాటు నిర్వహణ ఛార్జీలు కూడా చెల్లించాలి. అటువంటి సందర్భంలో, మీరు మీ అద్దెదారుని నుంచి విడిగా వసూలు చేయవచ్చు లేదా నిర్వహణ ఛార్జీలను వారి స్వంతంగా చెల్లించమని వారిని అడగవచ్చు, తద్వారా ఇది మీ అద్దె ఆదాయానికి యాడ్ అవదు. మీరు అద్దెకు ఆదాయాన్ని సంపాదించే అనేక ఆస్తులను కలిగి ఉంటే, ఈ ఆదాయం మీ వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు.
Published August 27, 2023, 21:27 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.