మిడ్‌క్యాప్ – స్మాల్‌క్యాప్ స్టాక్స్ గందరగోళం.. ఇప్పుడు ఇన్వెస్టర్ ఏమి చేయాలి? php // echo get_authors();
?>
కవిత ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆమె పోర్ట్‌ఫోలియోలోని అనేక మిడ్‌క్యాప్ - స్మాల్‌క్యాప్ స్టాక్‌లు ఈ ఏడాది 150 నుంచి 200 శాతం వరకు అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. మరి ఎందుకు సంతోషంగా ఉండదు? అయితే, ఆమెకు ఇప్పుడు ఇబ్బంది..
కవిత ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆమె పోర్ట్‌ఫోలియోలోని అనేక మిడ్‌క్యాప్ – స్మాల్‌క్యాప్ స్టాక్‌లు ఈ ఏడాది 150 నుంచి 200 శాతం వరకు అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. మరి ఎందుకు సంతోషంగా ఉండదు? అయితే, ఆమెకు ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది. ఈ సంతోష సమయంలో ఆ ఇబ్బంది తన ఆనందాన్ని ఆందోళనగా మార్చేస్తోంది. కవిత ఈ ఇబ్బందికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, దేశంలోని పెద్ద బ్రోకరేజ్ సంస్థ, కోటక్ ఈక్విటీస్ మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ స్టాక్‌లపై ఇకపై సలహా ఇవ్వబోమని ప్రకటించింది. రెండోది మంగళవారం మార్కెట్లు కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నప్పుడు, మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ రంగం బుడగ పెలిపోతుందా? మరి ఇప్పుడు కవిత లాంటి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి?
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఏమి చేసిందో అలాగే ఏమి చెప్పిందో ముందు మనం అర్థం చేసుకుందాం… కోటక్ ఈక్విటీస్ ఇప్పుడు మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి సలహా ఇవ్వడం ఆపివేసింది. అలాగే ఈ రంగంపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ రంగాలలో, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్ – ఇన్సూరెన్స్ కాకుండా, ఒక సంవత్సరంలో మరింత వృద్ధికి అవకాశం ఉన్న ఇతర స్టాక్‌లు చాలా తక్కువగా ఉన్నాయని కోటక్ చెబుతోంది.
ఈ క్యాలెండర్ సంవత్సరంలో BSE మిడ్‌క్యాప్ – BSE స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 33 శాతం – 31 శాతం పెరిగినప్పుడు ఇదే పరిస్థితి. మరోవైపు, ఈ కాలంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ BSE సెన్సెక్స్ 10 శాతం మాత్రమే లాభపడింది. ఏది ఏమైనప్పటికీ, సెప్టెంబర్ 12న నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ దాదాపు 3 శాతం పడిపోయింది. అలాగే నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ దాదాపు 4 శాతం పడిపోయింది. మూడేళ్లలో ఈ సూచీల్లో ఇదే అతిపెద్ద క్షీణత. ఇదే కోటక్ రిపోర్ట్ కు కారణం అయి ఉండవచ్చు. అలాగే ఈ ఫండ్స్ విషయంలో భారీ ఉప్పెన విరుచుకు పడవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.
అనేక మిడ్‌క్యాప్ – స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో ఇటీవలి భారీ పెరుగుదల వెనుక ఎటువంటి ప్రాథమిక కారణం కనిపించడం లేదని బ్రోకరేజ్ తెలిపింది. ఈ కంపెనీల ఫండమెంటల్స్‌లో అర్ధవంతమైన మార్పు లేదు. వాస్తవానికి, చాలా కంపెనీల ప్రాథమిక అంశాలు మరింత దిగజారిపోయాయి. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ షేర్ల ధరలు భారీగా పెరగడం అంటే మిడ్‌క్యాప్ – స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో ఇన్వెస్టర్ల ఈ సేకరణలో ఎలాంటి లాజిక్ లేదని అభిప్రాయపడుతోందని దీని అర్థం. గత నెలల్లో అధిక రాబడులు రావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యారు. మంగళవారం పతనం కంటే ముందు పరిస్థితి చూసినట్టయితే, గత ఆరు నెలల్లో చాలా మిడ్‌క్యాప్ – స్మాల్‌క్యాప్ స్టాక్‌లు 100 నుంచి 200 శాతం రాబడిని ఇచ్చాయి.
సంస్థాగత అలాగే చిన్న పెట్టుబడిదారుల కొత్త ప్రాధాన్య షేర్లు ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, EMS, రైల్వేస్, రియల్ ఎస్టేట్, రెన్యూవబుల్స్ వంటి విస్తృత రంగాల నుంచి వస్తున్నాయని కోటక్ చెప్పింది. గత 3 నుంచి ఆరు నెలల్లో ఈ షేర్లు మంచి రాబడిని ఇచ్చాయి. కానీ అలాంటి అనేక కంపెనీలు కార్యాచరణ – ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మార్కెట్‌కి ఇంతటి విశ్వాసం ఏర్పడటానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని కోటక్ స్పష్టంగా చెబుతోంది.
కోటక్ అటువంటి రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది? సాధారణ పెట్టుబడిదారులు ఇప్పుడు ఏమి చేయాలి? దీనిపై, ఫిన్‌మార్ట్ వ్యవస్థాపకుడు అరుణ్ మంత్రి మాట్లాడుతూ, మిడ్‌క్యాప్ – స్మాల్‌క్యాప్ షేర్ల విలువ చాలా ఎక్కువగా ఉంది. మిడ్‌క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే ప్రస్తుత స్థాయిలలో అధిక రాబడిని పొందడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. మీ పెట్టుబడి బలహీనమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ఉన్నట్లయితే, ఈ కాలంలో ఖచ్చితంగా బయటకు రావడం మంచిది. మీరు మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, దీర్ఘకాలం పాటు దానిలో ఉండండి, కానీ పెద్ద పతనం విషయంలో ఎవరేజ్ ను కొనసాగించడం చేయాలని అరుణ్ మంత్రి సూచిస్తున్నారు. మొత్తంమీద, ఎటువంటి మద్దతు లేకుండా ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. బలహీనమైన స్టాక్‌ల నుంచి బయటపడండి. మంచి స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేస్తూనే యావరేజ్ అయ్యే అవకాశాల కోసం చూడండి.
Published September 15, 2023, 21:40 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.