లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు కొని వదిలి పెట్టడం కరెక్టేనా? php // echo get_authors();
?>
తరచుగా పదే పదే రికమెండ్ చేస్తున్నలార్జ్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం మీ లాభాలకు హామీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? వాటిలో పెట్టుబడి పెట్టిన డబ్బు గురించి నిశ్చింతగా ఉండొచ్చని మీరు..
తరచుగా పదే పదే రికమెండ్ చేస్తున్నలార్జ్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం మీ లాభాలకు హామీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? వాటిలో పెట్టుబడి పెట్టిన డబ్బు గురించి నిశ్చింతగా ఉండొచ్చని మీరు నమ్ముతున్నారా? అది అలా కాదు.. మీరు కచ్చితంగా అలా చేయకూడదు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం ఇప్పుడు మీకు చెప్తాను…
ఒక సంవత్సరం క్రితం, వికాస్ తన కంపెనీ నుంచి బోనస్ అందుకున్నాడు. తెలిసిన ఒకాయన సలహా మేరకు అతను తన మొత్తం డబ్బును కొన్ని కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టాడు. కానీ ఈరోజు, అతను పెట్టుబడి పెట్టిన షేర్లు గత సంవత్సరంలో పేలవంగా పనిచేయడంతో బాధపడుతున్నాడు. వాస్తవానికి, ఈ షేర్లు నిఫ్టీ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను కూడా తక్కువగా ప్రదర్శించాయి. అంటే నిఫ్టీతో పోలిస్తే అవి తక్కువ రాబడిని ఇచ్చాయి. వాస్తవానికి, వివిధ రంగాల షేర్లలో పెట్టుబడులు పెట్టమని.. వాటి గురించి కొంతకాలం మరచిపోమని వికాస్‌కి ఎవరో సలహా ఇచ్చారు.
వికాస్ లాగానే చాలా మంది నిపుణుల సిఫార్సుల షేర్లను బలమైన షేర్లుగా నమ్మి గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఈ షేర్ల గురించి చర్చించే ముందు, లార్జ్ క్యాప్ షేర్లు అంటే ఏమిటో అలాగే వాటిని జెయింట్స్ అని ఎందుకు అంటారు? అనేది చూద్దాం.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం, టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్‌గా వర్గీకరించారు. , అంటే వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఇవి దిగ్గజ కంపెనీలు. దీనితో పాటు, ఏదైనా రంగంలో, అత్యధిక సంఖ్యలో ఉత్పత్తులు, అత్యధిక ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెట్ వాటా లేదా ఆదాయం, లాభాల పెరుగుదల వంటి అంశాల ఆధారంగా కంపెనీని కూడా ఆధిపత్య కంపెనీగా పరిగణించవచ్చు.
వికాస్ కొనుగోలు చేసిన షేర్లు రెండు కేటగిరీలుగా ఉంటాయి – ఒకటి నిఫ్టీ కంటే తక్కువ పనితీరును కలిగి ఉంది. అంటే అవి గత సంవత్సరంలో సానుకూల రాబడిని ఇచ్చాయి. అయితే ఈ రాబడఇండెక్స్ కంటే తక్కువ. నిఫ్టీ గత సంవత్సరంలో సుమారుగా 11% రాబడిని అందించగా, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, SBI,TCS వంటి స్టాక్‌లు 2% నుంచి 9% వరకు మాత్రమే రాబడిని ఇచ్చాయి. మరోవైపు, నిఫ్టీతో పోలిస్తే 18% వరకు ప్రతికూల రాబడిని అందించిన హావెల్స్, హెచ్‌యుఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్ఆర్ఎఫ్, పిడిలైట్, డి-మార్ట్, పేజ్ ఇండస్ట్రీస్.. యుపిఎల్ వంటి షేర్ల సుదీర్ఘ జాబితా ఉంది.
ముందుగా, ఈ షేర్ల పనితీరు సరిగా లేకపోవడానికి గల కారణాలను తెలుసుకుందాం. ఆపై వాటితో ఏమి చేయాలో తెలుసుకుందాం. క్యూ1ఎఫ్వై24 ఫలితాల తర్వాత డెట్‌లో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో డిమాండ్ బలహీనంగా ఉండటంతో అగ్రోకెమికల్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన యుపిఎల్ను బ్రోకర్లు డౌన్‌గ్రేడ్ చేశారు. అదేవిధంగా, Q4FY23లో లాభాలు 59% క్షీణించడం – బలహీనమైన డిమాండ్ గురించి ఆందోళనల కారణంగా విశ్లేషకులు పేజ్ ఇండస్ట్రీస్‌కు ప్రతికూల రేటింగ్ ఇచ్చారు. అదీకాకుండా పెరిగిన ఖర్చులు – తక్కువ లాభాల అంచనాలు డి-మార్ట్ షేరు ధరలో క్షీణతకు దారితీశాయి. మరోవైపు, పోటీ – పెరుగుతున్న ఖర్చుల కారణంగా బ్రోకర్లు పిడిలైట్పై అంత బుల్లిష్‌గా లేరు.
ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ పరాజయం పాలైన దిగ్గజాల షేర్లను ఏమి చేయాలి? మార్కెట్ నిపుణుడు అంబ్రిష్ బలిగా చెబుతున్న దాని ప్రకారం, కోవిడ్ అనంతర బుల్ రన్లో రసాయన, రిటైల్ లేదా ఎఫ్ఎంసిజి రంగాలలో దిగ్గజాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. అందువల్ల, కొన్ని రంగాలలో పనితీరు తక్కువగా ఉంది. ముఖ్యంగా ఫలితాలు నిరాశపరిచిన కంపెనీలలో. అదేవిధంగా, తగ్గిన వినియోగం – పెరుగుతున్న పోటీ కారణంగా FMCG షేర్లు ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాయి. అయితే, ఇప్పుడు స్పెషాలిటీ కెమికల్స్‌కి సంబంధించిన కొన్ని షేర్లలో పికప్ ఉంది. ముఖ్యంగా గ్లోబల్ లీడర్లు. కాబట్టి, UPL, Pidilite, SRF, ఏషియన్ పెయింట్స్ , హావెల్స్ కాంట్రా-బైయింగ్ కోసం మంచి ఆప్షన్స్ కావచ్చు, అంటే మార్కెట్ పడిపోయినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు.
చివరిగా ఒక మాట. దిగ్గజాల షేర్లు కూడా మార్కెట్లో పేలవంగా పని చేస్తాయి. కాబట్టి, వికాస్ లాగా, ఎవరైనా గుడ్డిగా ఏదైనా షేరులో పెట్టుబడి పెట్టకూడదు. పెట్టుబడి పెట్టిన తర్వాత దాని గురించి మరచిపోయే తప్పును ఖచ్చితంగా నివారించాలి.
Published September 16, 2023, 20:14 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.