శివ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల అతని వ్యాపారం బాగానే సాగింది. అంతేకాకుండా గతంలో పంపిన ఆర్డర్లకు సంబంధించి నిలిచిపోయిన పేమెంట్స్ కూడా అందుకున్నాడు. భారీ లాభాలు వచ్చాయి. దీంతో తన వద్ద ఎక్కువగా ఉన్న డబ్బును ఈ డబ్బును ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? లేకపోతె కొంత మొత్తం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కొంత మొత్తం తరువాత పెట్టుబడిలో పెడితే మంచిదా?అనే డైలమాలో పడ్డాడు. అయితే, శివ కనుక ఇప్పుడు కొంత మొత్తం పెట్టుబడి పెట్టి మిగిలినది అలా ఉంచాలన్నా కష్టమే. ఎందుకంటే ఆ డబ్బు వేరే విధంగా దుబారాగా ఖర్చయిపోతుందనే భయం ఉంది. అలా అని మార్కెట్ కదలికలపై ఎటువంటి గ్యారెంటీ లేదు. మార్కెట్ ఎప్పుడూ అప్ అండ్ డౌన్స్ తో ఉంటుంది. ఇప్పడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో శివ చాలా గందరగోళంలో ఉన్నదనే చెప్పాలి. ఇప్పుడు మనం శివ లాంటి వారి టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేద్దాం.
శివ లాంటి పెట్టుబడిదారులు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలి… సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా, అంటే STP ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ విధానంలో మొత్తం డబ్బు ఒకేసారి నేరుగా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం జరగదు.
ముందుగా, మొత్తం డబ్బు డెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత, అది క్రమంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కి STP ద్వారా ముక్కలుగా బదిలీ చేస్తారు. మొదట ఈ డబ్బును డిపాజిట్ చేసిన పథకాన్ని మూల పథకం అంటే సోర్స్ స్కీం అంటారు. దీని తరువాత డబ్బు ట్రాన్స్ఫర్ చేసే పథకాన్ని టార్గెట్ స్కీం అంటారు. STP మ్యూచువల్ ఫండ్ ఒక స్కీమ్ నుంచి డిపాజిట్ చేసిన మొత్తాన్ని దాని మరొక స్కీమ్‌కు క్రమశిక్షణతో బదిలీ చేస్తుంది. చాలా మంది వ్యక్తులు డెట్ స్కీమ్ నుంచి ఈక్విటీ స్కీమ్‌కి డబ్బును స్థిర కాలానికి బదిలీ చేస్తూనే ఉంటారు. దీని వ్యవధి సాధారణంగా 6 నెలలు, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు… ఇన్వెస్టర్‌లు ఎన్నిసార్లు తమ డబ్బును బదిలీ చేయాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ప్రతి వారం, ప్రతి నెల, త్రైమాసిక లేదా ఏదైనా ఇతర ఆప్షన్ కూడా తీసుకోవచ్చు.
STPలు నిజానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు లేదా మ్యూచువల్ ఫండ్ SIPల వంటివి. ఒకే తేడా ఏమిటంటే, STP కింద, డబ్బు ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కి బదిలీ చేస్తారు. అయితే SIPలలో, డబ్బు పెట్టుబడిదారుడి బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఫండ్ హౌస్‌కి వెళుతుంది.
మీరు STPల ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు ఎంట్రీ లోడ్ ఉండదు. దీని అర్థం మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, మీరు యూనిట్లను విక్రయించినప్పుడు, పెట్టుబడి విలువలో 2% వరకు ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తప్పనిసరిగా టార్గెట్ స్కీం కు కనీసం 6 సార్లు నిధులను బదిలీ చేయాలి. అయితే ఈ బదిలీలకు గరిష్ట పరిమితి లేదు.
STP కింద, మీరు నిధులను బదిలీ చేసినప్పుడు, అది సోర్స్ స్కీమ్ నుంచి నిష్క్రమణ అంటే రిడెంప్షన్ గా పరిగణిస్తారు. ఇది టార్గెట్ స్కీమ్‌లోని యూనిట్ల కొనుగోలు. కాబట్టి, మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారీ, సోర్స్ స్కీం యూనిట్లపై క్యాపిటల్ గెయిన్స్ పై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాలి. ఇది ఈక్విటీ-ఓరియెంటెడ్ లేదా డెట్-ఓరియెంటెడ్ వంటి మీ సోర్స్ స్కీమ్ రకంపై ఆధారపడి ఉంటుంది.
STP ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ..మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ వద్ద పెట్టుబడి కోసం పెద్ద మొత్తం ఉంటే, అస్థిర మార్కెట్‌ల కోసం మ్యూచువల్ ఫండ్‌లలో STP ఉత్తమ ఎంపిక. రాబడుల పరంగా, STP మొత్తం పెట్టుబడి కంటే మెరుగైనది అని మనీఫ్రంట్ సీఈఓ మోహిత్ గ్యాంగ్ చెబుతున్నారు. STP ద్వారా పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు సోర్స్ స్కీమ్ నుంచి రాబడిని పొందుతారు. అంటే మీరు ఒకే మొత్తంలో పెట్టుబడి పెట్టడం తరువాత డబ్బు టార్గెట్ స్కీం కి వెళ్లినప్పుడు, మీరు అక్కడ నుంచి కూడా రాబడిని పొందుతారు అని అయన అంటున్నారు.
శివ దగ్గర 2 లక్షల రూపాయలు ఉండి, దాన్ని ఒకేసారి ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, యూనిట్‌కు రూ. 100 చొప్పున, ఒక సంవత్సరంలో 2,000 యూనిట్లు జమ అవుతాయి. NAV 113 ప్రకారం, అతని పెట్టుబడి విలువ 2 లక్షల 26 వేల రూపాయలు. శివ STPలో అదే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లయితే ఎంత రాబడి పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
శివ ఒకేసారి 2 లక్షల రూపాయలను లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి నెలా 16,667 రూపాయలు ఈక్విటీ ఫండ్‌కు ట్రాన్స్ఫర్ అవుతాయి. 12 నెలలకు 16,667 రూపాయలను బదిలీ చేసిన తర్వాత, లిక్విడ్ ఫండ్‌లో మిగిలిపోయిన మొత్తం 8% వార్షిక రాబడిని అందజేస్తుందని మనం ఊహించవచ్చు.
మరోవైపు, ఈక్విటీ ఫండ్‌లో 16,667 రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు. అక్కడ యూనిట్లు యాడ్ అవుతూనే ఉంటాయి. ఒక సంవత్సరంలో 2,055 యూనిట్లు యాడ్ అయితే. అప్పుడు, సంవత్సరం చివరిలో అతని పెట్టుబడి విలువ 2,32,173 రూపాయలు అవుతుంది. అదనంగా, లిక్విడ్ ఫండ్‌లో అతని పెట్టుబడి విలువ 7,718 రూపాయలుగా ఉంటుంది.
ఈ విధంగా, సంవత్సరం చివరిలో, శివ పెట్టుబడి మొత్తం విలువ 2,39,891 రూపాయలు అవుతుంది. STP సహాయంతో శివ అదనంగా 13,891 రూపాయలు సంపాదించినట్లు స్పష్టమైంది. కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులలో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఈ STP వ్యూహం సరైనది అని చెప్పవచ్చు. మీరు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, ప్రతి నెలా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టాలనుకుంటే, SIP మీకు సరైనది అవుతుంది. ఏది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆర్థిక సలహాదారుని సూచనలు తీసుకోవడం మంచిది.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.
Trending 9
Exclusive