ఫ్రీడం సేల్‌లో నిజంగా డిస్కౌంట్స్ ఇస్తారా? చెక్ చేయండి

అనామిక తన షాపింగ్ ప్లాన్‌లన్నింటికీ బ్రేకులు వేసింది. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఫ్రీడమ్ సేల్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఆగస్టు నెల ప్రారంభమైన వెంటనే ప్రతి వెబ్‌సైట్‌లో ఫ్రీడమ్ సేల్ ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైన వెంటనే, అనామిక షాపింగ్ కూడా ప్రారంభమైంది..

అనామిక తన షాపింగ్ ప్లాన్‌లన్నింటికీ బ్రేకులు వేసింది. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఫ్రీడమ్ సేల్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఆగస్టు నెల ప్రారంభమైన వెంటనే ప్రతి వెబ్‌సైట్‌లో ఫ్రీడమ్ సేల్ ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైన వెంటనే, అనామిక షాపింగ్ కూడా ప్రారంభమైంది. అయితే తను ఎంచుకున్న ఒక్కో వస్తువు ధరను చూసి అనామిక మదిలో మెదిలే ప్రశ్న ఏమిటంటే.. ఈ వస్తువుపై తగ్గింపు ఉందా లేదా?

ఆమె అనుమానం ఏమీ ఆధారం లేనిది కాదు. Amazon, Flipkart నుంచి Myntra వరకు… Nykaa Fashion, Instamart, Big Basket to Croma అలగే Vijay Sales.com అన్నీ భారీ సేల్స్ నిర్వహించి, 60 నుంచి 70% తగ్గింపును ఇసున్నట్లు క్లెయిమ్ చేస్తున్నాయి. అయితే ఈ అమ్మకాలు నిజంగా మీ డబ్బును ఆదా చేస్తాయా? అనేది ఆలోచించవలసిన విషయం.

ఒకసారి ఇలా ఆలోచించండి.. ఫిజికల్ స్టోర్‌లో రూ. 2,900 MRP ఉన్న వుడ్‌ల్యాండ్ షూ జూలైలో దాదాపు రూ. 1,800కి Myntraలో అందుబాటులో ఉంది. Myntra ఫ్రీడమ్ ఫెస్ట్ సేల్ సమయంలో అదే షూ ధర దాదాపు రూ. 2,000 వరకు పెరిగింది. అది కూడా 35% తగ్గింపుతో. మీరు ఏమనుకుంటున్నారు? అమ్మకంలో ధర తగ్గడానికి తగ్గే బదులుగా ఎందుకు పెరిగింది? 2,900 MRPపై 35 శాతం తగ్గింపు ఇచ్చినా.. అంతకు ముందు అంటే జూలైలో ఇచ్చిన ధరకంటే ఎక్కువ ధర ఉంది. అంటే ఈ సేల్స్ నిజమైన అర్ధం ఏమిటి?

అదేవిధంగా, కిరాణా డెలివరీ యాప్ ఇన్‌స్టామార్ట్ కిరాణా వస్తువులపై గరిష్టంగా 50% తగ్గింపును క్లెయిమ్ చేస్తోంది. అయితే మేము ధరలను చెక్ చేసినప్పుడు, మేము ఒక విషయాన్ని తెలుసుకున్నాము. ఇండియా గేట్ ఎవ్రీడే బాస్మతి రైస్ 5 కిలోల ప్యాక్ ప్రస్తుతం సుమారు రూ.350కి అందుబాటులో ఉంది. ఇది గత నెలాఖరులో కూడా దాదాపు అదే ధరకు అందుబాటులో ఉంది. అదేవిధంగా హ్యాపీలో 1/2 కిలోల జీడిపప్పు ప్యాకెట్ గత నెలలో దాదాపు రూ.520కి లభిస్తుండగా ప్రస్తుతం రూ.527కి లభిస్తోంది. అంటే, డిస్కౌంట్ సేల్స్ అని చెప్పినప్పటికీ, కొన్ని ప్రొడక్ట్స్ విషయంలో ధరలు అలాగే ఉంటాయి లేదా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్‌లు మొదలైనవాటిలో కూడా ఇటువంటి ధరల తారుమారు కనిపిస్తుంది. Croma- Vijaysales.com సైట్‌లలో యాభై నుంచి 65% తగ్గింపు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మీరు తగ్గింపు ధర.. అసలు ధర మధ్య ధర వ్యత్యాసాన్ని లెక్కించినప్పుడు, తేడా కేవలం కొన్ని రూపాయలు మాత్రమే. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి కొత్త ఉత్పత్తులను ఈ సైట్‌లలో విడుదల చేస్తున్నారు. కానీ వాటి ధరలో ఎలాంటి తగ్గింపు ఉండదు, ఎందుకంటే అవి కొత్తవి అలాగే తాజా వెర్షన్‌ కాబట్టి.

మీరు హిడెన్ ఛార్జీలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు ఉచిత డెలివరీ,  డెలివరీ ఫీజు, కొన్నిసార్లు నిర్వహణ ఛార్జీలు.. కొన్నిసార్లు కన్వీయన్స్ ఫీజు … ఈ ఛార్జీలన్నీ చివరికి ప్రోడక్ట్ కాస్ట్ కి యాడ్ అవుతాయి. కాబట్టి మీరు ఈ డబ్బును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా, ఏది షాపింగ్ చేసినా చాలా తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయనే అత్యాశతో చేయకండి. ఈ విక్రయాలు కూడా అధిక ఖర్చుకు ప్రధాన కారణంగా ఉంటాయి. ఆన్‌లైన్ సేల్‌లో షాపింగ్ చేసే ముందు, మీకు ఆ వస్తువు అవసరమా కాదా అని అంచనా వేయండి. ఆన్‌లైన్‌లో ఖర్చు చేసే ముందు, ఫిజికల్ స్టోర్‌లను సందర్శించడం ద్వారా ధరలను చెక్ చేయండి. రెండు చోట్లా ఉన్న ధరలను సరిపోల్చండి. మీకు సరైన డీల్ దొరికిన చోట నుంచి మాత్రమే షాపింగ్ చేయండి.

Published August 13, 2023, 13:03 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.