ఇంటి కోసమే కాదు.. భూమి కోసం కూడా లోన్ ఇస్తారు తెలుసా?

హైదరాబాద్ కు చెందిన మురారికి కట్టిన ఇల్లు కొనడం కంటే.. ప్లాట్ కొనుక్కుని ఇల్లు తనకు నచ్చినట్టుగా కట్టుకోవాలని కోరిక. అయితే, బ్యాంకులు ఇల్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం కోసం లోన్స్ ఇస్తాయి కానీ.. ప్లాట్ కొనుక్కోవడానికి ఇవ్వవు అని చాలామంది చెప్పగా విన్నాడు మురారి. మీరు కూడా మురారి..

హైదరాబాద్ కు చెందిన మురారికి కట్టిన ఇల్లు కొనడం కంటే.. ప్లాట్ కొనుక్కుని ఇల్లు తనకు నచ్చినట్టుగా కట్టుకోవాలని కోరిక. అయితే, బ్యాంకులు ఇల్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం కోసం లోన్స్ ఇస్తాయి కానీ.. ప్లాట్ కొనుక్కోవడానికి ఇవ్వవు అని చాలామంది చెప్పగా విన్నాడు మురారి. మీరు కూడా మురారి లానే ఇలా విని ఉంటె.. అది సరైనది కాదు. ఇందులో అస్సలు నిజం లేదు. మీరు భూమి లేదా ప్లాట్ కొనడానికి కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఈ లోన్ ఎలా పొందాలో అలాగే వడ్డీ రేటు ఎంత ఉండచ్చు.. అదీకాకుండా హోమ్ లోన్ కీ.. దీనికీ ఎటువంటి తేడా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇల్లు లేదా ఫ్లాట్‌ని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకోవడం కంటే భూమి లేదా ప్లాట్ కోసం లోన్  తీసుకోవడం సులభం. అయితే ఇక్కడ భూమి విషయంలో అది ఏ రకానికి చెందినది అనేది చాలా ముఖ్యం. చాలా బ్యాంకులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి లోన్స్ ఇవ్వవు. కొన్ని PSUలు, అంటే ప్రభుత్వ బ్యాంకులు లోన్స్ ఇస్తాయి కానీ అందరు కస్టమర్స్ కీ ఇవ్వవు. భూమి లేని చిన్న రైతులు లేదా కూలీలు వ్యవసాయ భూమి కోసం లోన్ పొందవచ్చు. ఇక వ్యవసాయేతర భూమి కొనుగోలు చేయడానికి లోన్  పొందడం కొంచెం సులభం అని చెప్పవచ్చు. అలాగే వీటిలో కూడా, రెసిడెన్షియల్ ప్లాట్ కోసం లోన్ మరింత ఈజీగా దొరుకుతుంది. రెసిడెన్షియల్ ప్లాట్ మునిసిపల్ కార్పొరేషన్ లేదా పట్టణ ప్రాంతంలో ఉండాలి.
నగరం శివార్లలో ప్లాట్‌ని కొనుగోలు చేయడానికి కూడా లోన్ పొందవచ్చు, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది… డెవలప్‌మెంట్ అథారిటీ లేదా పెద్ద డెవలపర్‌లు చేసిన ప్లాట్ లకు మాత్రమె బ్యాంకులు సాధారణంగా రెసిడెన్షియల్ ప్లాట్‌ల కోసం లోన్స్ ఇస్తాయి.

హోమ్ లోన్స్ 30 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్లాట్ లేదా భూమి లోన్  కాలపరిమితి అంత ఎక్కువ కాలం ఉండదు…
ప్లాట్ల పై  లోన్‌ను తిరిగి చెల్లించడానికి బ్యాంకులు సాధారణంగా 15 సంవత్సరాల వరకు గడువు ఇవ్వవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI ప్లాట్ లోన్ కాలవ్యవధి 10 సంవత్సరాలు. ప్లాట్ లోన్ LTV అంటే లోన్-టు-వాల్యూ రేషియో హోమ్ లోన్ కంటే తక్కువగా ఉంది. హోం లోన్ విషయంలో, ఇది ఆస్తి ధరలో 90% వరకు ఉంటుంది. అయితే, ప్లాట్ లోన్ విషయంలో, భూమి ధరలో  70 నుంఛి 75 శాతం మాత్రమే లోన్‌గా అందుబాటులో ఉంటుంది. ప్లాట్ లోన్ తీసుకున్నప్పుడు దాదాపు 25 నుంచి 30 శాతం డబ్బును జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్‌తో పోలిస్తే ప్లాట్ లోన్ కొంచెం రిస్క్‌తో కూడుకున్నదిగా పరిగణిస్తారు. దీని కారణంగా, ప్లాట్ లోన్  వడ్డీ రేటు హోమ్ లోన్ కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య లేదా పారిశ్రామిక ప్లాట్ల విషయంలో, వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చు.

bankbazaar.com ప్రకారం, SBI హోమ్ లోన్ రేటు 9.15 శాతం నుంచి మొదలవుతుంది, అయితే ప్లాట్ లోన్ వడ్డీ రేటు 9.20 నుంచి 9.80 శాతం మధ్య నుంచి మొదలవుతుంది . HDFC హోమ్ లోన్ రేటు 8.45 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్లాట్ లోన్ప్రారంభ  రేట్లు 8.65 నుంచి 9.35% వరకు ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.80% నుంచి ప్రారంభమవుతాయి, ప్లాట్ లోన్ రేట్లు 12.35% నుంచి ప్రారంభమవుతాయి… PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ లోన్ రేట్లు 8.75% నుంచి ప్రారంభమవుతాయి, అయితే ప్లాట్ లోన్ ప్రారంభ రేటు 9.5 నుంచి 11.65 శాతం మధ్య ఉంది…

సెక్షన్ 80C కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై రూ. 1.5 లక్షల వరకు అలాగే సెక్షన్ 24B కింద చెల్లించే వడ్డీపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే, ప్లాట్ లేదా భూమి లోన్ విషయంలో టాక్స్ బెనిఫిట్స్ అందుబాటులో ఉండవు. మీరు భూమిని కొనుగోలు చేయడానికి, ఇల్లు నిర్మించడానికి ప్లాట్ కొనుగోలు అలాగే నిర్మాణ రుణం తీసుకుంటే, మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్లాట్ ప్లస్ నిర్మాణ రుణం తీసుకోవడం ద్వారా మురారి ప్రయోజనం పొందవచ్చు. ఇలా చేయడం హోం లోన్ కిందే పరిగణిస్తారు. వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మొత్తం ఖర్చులో 80-90% వరకు లోన్ కూడా అందుబాటులో ఉంటుంది. లోన్ ఇవ్వడానికి ముందు, బ్యాంక్ ప్రాపర్టీ వాల్యూను చెక్ చేస్తుంది. అలాగే టైటిల్ డీడ్ అంటే రిజిస్ట్రీ తో పాటు మీ లోన్ రీపెమేంట్ సామర్థ్యాన్ని కూడా చెక్ చేస్తుంది.

Published August 16, 2023, 21:41 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.