మీ బ్యాంకు లోన్ పెంచాలని అనుకుంటున్నారా?

ఇంటి గేటు పక్కన తన నేమ్ ప్లేట్ తో ఉన్న ఇల్లు.. ఇది నరేష్ కల. అందుకోసం 2013లో బిల్డర్ వద్ద ఇల్లు బుక్ చేసుకున్నాడు. దానికి ఈఎంఐ కడుతూ వస్తున్నాడు. పదేళ్లు గడిచినా అతని ఇంటి కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. బిల్డర్ చేసిన ఆర్ధిక తప్పిదం వలన ప్రాజెక్ట్..

ఇంటి గేటు పక్కన తన నేమ్ ప్లేట్ తో ఉన్న ఇల్లు.. ఇది నరేష్ కల. అందుకోసం 2013లో బిల్డర్ వద్ద ఇల్లు బుక్ చేసుకున్నాడు. దానికి ఈఎంఐ కడుతూ వస్తున్నాడు. పదేళ్లు గడిచినా అతని ఇంటి కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. బిల్డర్ చేసిన ఆర్ధిక తప్పిదం వలన ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే, ఆ భారాన్ని నరేష్ మోయాల్సి వస్తోంది. రెరా జోక్యం తర్వాత, నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టుల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ ఇళ్లను నిర్మించే బాధ్యతను ఇప్పుడు కొత్త బిల్డర్‌కి అప్పగిస్తున్నారు. కానీ కొత్త బిల్డర్లు ఇళ్లను పూర్తి చేయడానికి ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. నరేష్ లాంటి లక్షలాది మంది ఈ డబ్బును ఏర్పాటు చేయడానికి బ్యాంకు తలుపు తట్టాల్సి ఉంటుంది. కొత్త బిల్డర్ అదనంగా డబ్బు అడిగినపుడు.. దాని కోసం లోన్ ఎలా పొందాలో ముందు అర్థం చేసుకోవచ్చు.

దేశంలో ఎన్ని ఇళ్లు నిలిచిపోయాయి..? అనేది ఒకసారి చూద్దాం..

ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రకారం. మే 2022 చివరి నాటికి, దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో దాదాపు 4 లక్షల 80 వేల ఇళ్లు వివిధ దశల నిర్మాణంలో నిలిచిపోయాయి. వాటి విలువ 4 లక్షల 48 వేల కోట్లు. ఈ గృహాలు 2014 సంవత్సరం లేదా అంతకు ముందు నిర్మాణం ప్రారంభించినవి. వీటిలో ఢిల్లీ-NCR, MMR, చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ మరియు కోల్‌కతా ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్, అంటే NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) నిలిచిపోయి ఉన్న ఇళ్ల నిర్మాణాల సంఖ్య పరంగా అత్యధికంగా 77 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

NCR లో 2 లక్షల 40 వేల 610 గృహాలు అలాగే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో 1 లక్ష 28 వేల 870 గృహాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. లేదా వీటిలో చాలా ఇళ్ల నిర్మాణం చాలా ఆలస్యంగా జరుగుతోంది. 7 నగరాల పరిస్థితే ఇలా ఉండగా… దేశంలోని ఇతర నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లో పని తిరిగి మొదలేనపుడు చాలా విషయాలు మారవచ్చు… పాత బిల్డర్ స్థానంలో కొత్త బిల్డర్ కొత్త ‘అగ్రిమెంట్ టు సేల్’ చేస్తాడు… ఇందులో అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, పాత బిల్డర్‌కు ఇచ్చిన డబ్బు, పెరిగిన ఇంటి ఖర్చు అలాగే ఇప్పుడు చెలించవలసిన మొత్తం ఇవన్నీ పేర్కొంటారు.

సాధారణంగా హోమ్ లోన్ తీసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా, చాలా సందర్భాలలో… కోర్ట్ ఆర్డర్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లేదా RERA ఆర్డర్ అలాగే యాజమాన్య మార్పు కోసం పత్రాలు అవసరం అవుతాయి. ఇవి పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవి లేదా డెవలపర్ ద్వారా కస్టమర్‌కు అందించినవి కావచ్చు.

అటువంటి సందర్భాలలో మూడు పరిస్థితులు తలెత్తుతాయి ..

మొదటిది, మీ పాత లోన్ కంటిన్యూ అవుతోంది. మీరు దానిని పెంచాలనుకుంటున్నారు. రెండవ పరిస్థితిలో మీ పాత లోన్ క్లియర్ అయింది. కేవలం పెరిగిన మొత్తానికి మాత్రమే మీకు రుణం కావాలి. చివరి పరిస్థితి ఏమిటంటే మీరు మొదటి సారి హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రాసెసింగ్ రుసుము, లీగల్ ఛార్జ్ మరియు డాక్యుమెంటేషన్ రుసుము మూడు సందర్భాలలోనూ చెల్లించవలసి ఉంటుంది.
జప్తు అయిన ఇంటి కోసం హోమ్ లోన్ ఇప్పటికే అమలులో ఉన్నట్లయితే… బ్యాంకు పెరిగిన వ్యయాన్ని ఇప్పటికే ఉన్న లోన్‌లో, అంటే టాపప్ లోన్‌లో ఇవ్వగలదు. బ్యాంకులు మీ ఆదాయం, వృత్తి, క్రెడిట్ స్కోర్ అలాగే అప్పు-ఆదాయ నిష్పత్తిని తనిఖీ చేస్తాయి.
కొత్త లోన్ విషయంలో కూడా ఈ వివరాలు చెక్ చేస్తారు. దీన్ని ఉపయోగించి మీరు పెరిగిన రుణ EMIని చెల్లించగలరా లేదా అనేది బ్యాంకుకు తెలుస్తుంది.

ఆగిపోయిన ప్రాజెక్ట్‌లో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి.. త్వరలో ఇల్లు అందుబాటులోకి రాబోతోందని భావించి సంతోషించవచ్చు. అయితే, పనుల వేగాన్ని పర్యవేక్షించాల్సి ఉంది. కొత్త బిల్డర్ సకాలంలో ఇంటిని పూర్తి చేస్తాడన్న నమ్మకం ఉంటే..
మీరు ఇంటిని పొందడానికి వేచి ఉండండి. లోన్ మొత్తంలో పెరుగుదల కారణంగా మీ బడ్జెట్ పెరుగుతుందని మీరు భావిస్తే, మీరు డీల్‌ను రద్దు చేసి, మీ డిపాజిట్‌ని తిరిగి పొందవచ్చు..

ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి..

అటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రస్తుత లోన్ రేట్లు తక్కువగా ఉన్న బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇది వడ్డీ భారం – ఈఎంఐని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇది కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితి. లోన్ ఎకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కొంచెం కష్టంతో కూడిన పని. మీరు మొదటి సారి హోమ్ లోన్ తీసుకుంటే, 4-5 బ్యాంకులతో మాట్లాడండి. తక్కువ రేటుకు రుణం ఇచ్చే బ్యాంకును ఎంచుకోండి. ప్రాసెసింగ్ ఫీజుతో సహా ఇతర ఛార్జీలపై చర్చలు జరపండి .

Published August 11, 2023, 21:57 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.