ఇల్లు కడుతున్నారా? పర్మిషన్స్ తీసుకున్నారా?

ఏమిటి? ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ కావాలా అని రాజేష్ దినేష్ ను అడిగాడు. దానికి దినేష్ అవును అని జవాబిచ్చాడు. అంతేకాకుండా..; ఎందుకు అలా అడుగుతున్నావు? అని ప్రశ్నించాడు..

ఏమిటి? ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ కావాలా అని రాజేష్ దినేష్ ను అడిగాడు. దానికి దినేష్ అవును అని జవాబిచ్చాడు. అంతేకాకుండా..; ఎందుకు అలా అడుగుతున్నావు? అని ప్రశ్నించాడు. రాజేష్ తన మామయ్య కొత్తగా ఇల్లు కడుతున్నాడని చెప్పాడు. ఇంటి నిర్మాణం ప్రారంభించక ముందే.. డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వచ్చి ఇంటి లే అవుట్ కి పర్మిషన్ లేదని చెప్పారు. నిజానికి రాజేష్, అతని కుటుంబానికి లే అవుట్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదు. అని చెప్పాడు. అది విన్న దినేష్ అవును ఇల్లు కట్టాలి అంటే బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందడం తప్పనిసరి అని చెప్పాడు.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని ఓ ఇల్లు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఈ ఇంటి డిజైన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నివాసం అనిలియాను పోలి ఉంటుంది. మీర్జాపూర్‌కు చెందిన సియారామ్ పటేల్ అనుమతులు లేకుండా 14 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. దానికి పెద్ద పెద్ద పిల్లర్లు నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, తుపాను ధాటికి ఈ ఇల్లు పేకమేడలా కూలిపోతుందేమోనని చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటె అసలు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరమా అనేది ప్రశ్న. దీనికి జవాబు కచ్చితంగా అవును. అయితే, ఈ అనుమతిని ఎక్కడ పొందాలి? ఇల్లు కట్టేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? తెలుసుకుందాం.

మన దేశంలో, భూమిని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి వ్యవసాయ భూమి రెండోది వ్యవసాయేతర భూమి. అందువల్ల, ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసే ముందు, భూమి ఏ వర్గానికి చెందుతుందో నిర్ధారించుకోండి. అయితే, వ్యవసాయేతర భూమిని కలిగి ఉండటం అంటే మీరు దానిలో ఇల్లు కట్టేసుకోవచ్చని అనుకోవద్దు. నిజానికి వ్యవసాయేతర భూమి రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్‌హౌసింగ్, IT పార్కులు వంటి అనేక వర్గాలను కలిగి ఉంటుంది. వ్యవసాయేతర భూమి రెసిడెన్షియల్ కేటగిరీలో ఉంటె మాత్రమే దానిలో ఇల్లు నిర్మించవచ్చు.

వ్యవసాయ భూమి, అంటే వ్యవసాయానికి ఉపయోగించే భూమి, దానిపై నేరుగా ఇళ్లు నిర్మించకూడదు. అటువంటి భూమిలో ఇంటిని నిర్మించడానికి ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడం అవసరం. ప్రభుత్వం లేదా లోకల్ అథారిటీస్ దానికి అనుమతి ఇచ్చినప్పుడే ఈ మార్పిడి సాధ్యమవుతుంది. ఈ మార్పిడి లేకుండా, వ్యవసాయ భూమిలో ఇంటిని నిర్మించడం వలన అది ఎప్పుడైనా కూల్చివేసే అవకాశం ఉంది. ఇలా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి మీరు కొంత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటిని నిర్మించే ముందు, ప్లాట్ ఫ్లోర్ ఏరియా రేషియో అంటే FARని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ అంతస్తుల స్థాయిలతో సహా ఇంటి మొత్తం కవరేజ్ ప్రాంతాన్ని నిర్ణయించడంలో FAR సహాయపడుతుంది. ఇది ప్రతి అంతస్తు వైశాల్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రభుత్వం లేదా స్థానిక అధికారం ఫ్లోర్ ఏరియా రేషియోను సెట్ చేస్తుంది. FAR వివిధ రాష్ట్రాల.. నగరాల మధ్య మాత్రమే కాకుండా వివిధ పొరుగు ప్రాంతాలలో కూడా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో, అనుమతించదగిన అంతర్నిర్మిత ప్రాంతాన్ని లెక్కించడానికి FAR స్థానంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే FSI ఉపయోగిస్తారు.

ఉదాహరణకు, ప్లాట్ విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు.. ఫ్లోర్ ఏరియా రేషియో (FAR) 2.00 అయితే, మీరు అన్ని అంతస్తుల ఏరియాలను కలిపితే, మీరు గరిష్టంగా 2,000 చదరపు అడుగుల కవర్ ప్రాంతాన్ని నిర్మించవచ్చని అర్థం. ఏదేమైనప్పటికీ, 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండటం వలన మీరు 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులను నిర్మించవచ్చని అర్థం కాదు, ఎందుకంటే భవనం కోడ్‌లో పరిగణించవలసిన ఇతర నిబంధనలు ఉన్నాయి. సెట్‌బ్యాక్‌లు, గ్రౌండ్ కవరేజ్, పార్కింగ్ అవసరాలు, ఎత్తు పరిమితులు మీరు తప్పనిసరిగా పాటించాల్సిన అదనపు నియమాలలో ఉన్నాయి.

ఫ్లోర్ ఏరియా రేషియో అంటే FARని కూడా శాతాల్లో వ్యక్తీకరించవచ్చు. ఉదాహరణకు, FAR 200% అయితే, ఫ్లోర్ ఏరియా రేషియో 2.00 అని అర్థం. హర్యానా బిల్డింగ్ కోడ్‌లో, రెసిడెన్షియల్ ప్లాట్‌ల కోసం FAR 100% నుంచి 220% వరకు ఉంటుంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్ బిల్డింగ్ బై లాస్ ప్రకారం, FAR 1.25 నుంచి 2.00 వరకు ఉంటుంది.

ప్లాట్ – భవనం మధ్య, ముందు, వెనుక లేదా అన్ని వైపులా కొంత స్థలాన్ని వదిలివేయాలి. ఈ స్థలాన్ని సెట్ బ్యాక్ ఏరియా అంటారు. అదేవిధంగా, ప్లాట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించేటప్పుడు, నిర్మాణం కోసం ఎంత ప్రాంతాన్ని ఉపయోగించవచ్చో నిర్ణయించే గ్రౌండ్ కవరేజీని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ 1,000 చదరపు అడుగుల విస్తీర్ణం – గ్రౌండ్ కవరేజీ 85% ఉంటే, అప్పుడు ప్లాట్ స్థాయిలో 850 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించవచ్చు. పార్కింగ్‌కు కూడా తగిన స్థలం కేటాయించాల్సి ఉంటుంది ఇంటి ఎత్తుకు సంబంధించి కూడా నిబంధనలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా హై టెన్షన్ లైన్ల దగ్గర లేదా విమానాశ్రయాల చుట్టూ నిర్మించడానికి నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలి.

చాలా మందికి ఈ నిబంధనలు తెలియక సరైన అవగాహన లేకుండానే ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇంటిని నిర్మించడానికి, మీకు అధికారం-రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీర్ అవసరం. వారు మీ అవసరాలు అదేవిధంగా అన్ని నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటూ ఇంటి ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ప్లాన్‌లో స్ట్రక్చరల్, ఫ్లోర్ లేఅవుట్‌లు ఉన్నాయి, ఇంటి కవర్ ప్రాంతం, పిల్లర్లు, బీమ్‌లు, పార్కింగ్ స్థలాలు, గది నంబర్లు, వంటగది, కొలతలు అలాగే పైకప్పు ఎత్తు, ఇతర వివరాలతో సహా ఉంటాయి. ఈ ప్లాన్ తప్పనిసరిగా స్థానిక మునిసిపల్ అథారిటీ ఆమోదించాలి. దీని కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో, బిల్డింగ్ ప్లాన్ అనుమతులను ఆన్‌లైన్‌లో పొందేందుకు ఒక నిబంధన ఉంది.

ప్లాన్ ఆమోదం పొందడం కోసం ఛార్జ్ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది తమ ప్లాం అప్రూవల్ తీసుకోకుండా తప్పించుకోవాలని చూస్తారు. కొన్నిసార్లు, ప్లాన్‌లు ఆమోదం పొందుతాయి. కానీ ఆ ఆమోదించిన ప్లాన్‌ల ప్రకారం ఇల్లు నిర్మాణం అవదు. ఈ వైరుధ్యం స్థానిక మునిసిపల్ అధికారులు నిర్మాణ పనులను నిలిపివేయడానికి కారణమవుతుంది. ఇల్లు కట్టిన చాలా సంవత్సరాల తర్వాత కూడా, ఆమోదించిన ప్లాన్‌లను పాటించనందుకు మీరు నోటీసులు అందుకోవచ్చు.

ఒక ప్రణాళిక ఆమోదించిన తర్వాత, మీరు నిర్మాణ సమయంలో దాని నుంచి వైదొలగలేరు. అందువల్ల, ఇంటి ప్లాన్ ప్రక్రియలో తొందరపడకుండా ఉండండి. మీ అషన్స్ జాగ్రత్తగా పరిశీలించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఇంటిని నిర్మించిన తర్వాత, మీరు స్థానిక మునిసిపల్ అథారిటీ నుండి పూర్తి ధృవీకరణ పత్రాన్ని పొందాలి. ఈ సర్టిఫికేట్ భవనం ప్లాన్ ఆధారంగా మంజూరు చేస్తారు. ఆమోదించిన ప్లాన్ ప్రకారం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు దాన్ని అందుకుంటారు.

సుబ్బారావు.. అంటే రాజేష్ మామ తమ ఇంటిని నిర్మించేటప్పుడు నిబంధనలను పట్టించుకోలేదు, కానీ అదే తప్పు మీరు చేయవద్దు. భూమిని కొనుగోలు చేసే ముందు, ఆస్తి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను పరిశీలించండి. నిర్మాణానికి ముందు మీ ఇంటి ప్లాన్‌ను ఆమోదించారని నిర్ధారించుకోండి. అదేవిధంగా నిర్మాణ సమయంలో ఆమోదించిన ప్లాన్‌కు కట్టుబడి ఉండేలా చూసుకోండి. ఎదో కొద్దిగా డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తే కనుక అది తరువాత గణనీయమైన నష్టాలకు దారితీయవచ్చు. ఇంటి బలం అలాగే స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం నిర్మాణం సరిగ్గా జరిగిందని నిర్ధారించుకోవడానికి సివిల్ ఇంజనీర్‌ను సంప్రదించడం మంచిది.

Published August 10, 2023, 22:05 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.