ఇంటి యజమానులు ఓనర్స్ అసోసియేషన్ ఏమి చెప్పినా వినాలా? php // echo get_authors();
?>
రవి తన ఇంటిని అద్దెకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. అకస్మాత్తుగా, అతని RWA ఇంటి యజమానులు ఎవరూ కూడా బ్రహ్మచారులకు ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని చెప్పింది. అయితే.. రవి తన ఇంటిని..
రవి తన ఇంటిని అద్దెకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. అకస్మాత్తుగా, అతని RWA ఇంటి యజమానులు ఎవరూ కూడా బ్రహ్మచారులకు ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని చెప్పింది. అయితే.. రవి తన ఇంటిని బ్రహ్మచారికి ఇవ్వాలని అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. దీంతో అతనికి ఏమి చేయాలో అర్ధం కావడంలేదు. ఇటువంటి పరిస్థితిలో రవి ఏమి చేయగలడు? తెలుసుకుందాం..
ఏ ఇంటి యజమాని బ్రహ్మచారికి ఆస్తిని అద్దెకు ఇవ్వకూడదని ఆదేశించింది. రవి అద్దెదారు బ్రహ్మచారి. అప్పటికే రవి అతడి నుంచి అడ్వాన్స్, సెక్యూరిటీ డబ్బులు తీసుకున్నాడు. అతనికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు? అతను ఏ ఎంపికలను అన్వేషించగలడు? తెలుసుకుందాం
అపార్ట్‌మెంట్ లేదా సొసైటీలోని ఇంటి యజమానుల గ్రూప్ ను అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా AOA అంటారు… ఈ సంఘాన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా RWA అని కూడా అంటారు. విద్యుత్, నీరు, రోడ్లు, పార్కులు, క్లబ్‌హౌస్‌లు, వీధి దీపాల నిర్వహణ, మరమ్మత్తు, అలాగే భద్రత వంటి ఇతర అవసరమైన సేవల బాధ్యత RWA లేదా AOAపై ఉంటుంది. ఈ పనులకు మెయింటెనెన్స్ ఛార్జీలు విధిస్తారు… ఇంటి సైజును బట్టి మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తారు.
సొసైటీలోని ఇంటి యజమానులందరూ ఓటు వేసి RWA లేదా AOA పాలకమండలిని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు, కార్యదర్శి – ట్రెజరర్ తో సహా కార్యనిర్వాహక సభ్యుల ఎంపిక జరుగుతుంది. RWA లేదా AoA రిజిస్ట్రేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం జరుగుతుంది… మీరు RWAలో మెంబర్‌గా మారడానికి సభ్యత్వం తీసుకోనవసరం లేదు… సొసైటీలో ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత, మీరు ఆటోమేటిక్‌గా RWAలో సభ్యులు అవుతారు…
RWAలో నివాసి లేదా సభ్యునిగా మీ హక్కులు ఏమిటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం… సభ్యునిగా, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ – బై-లాస్ కాపీ కోసం RWAని అడగడం మీ మొదటి హక్కు. RWAకి ఏ అధికారాలు ఉన్నాయో కనిపెట్టడంలో ఇది మీకు సహాయపడుతుంది. అది ఏ పని చేస్తుంది? ఇది ఏ నియమాలు మ- నిబంధనలను రూపొందించింది? వంటి విషయాలు అర్ధం అవుతాయి.
సాధారణంగా RWAలు ఎన్నికలు లేకుండా పనిచేస్తారని – ఆర్థిక అవకతవకలకు పాల్పడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి… మీ RWA మీకు ఏదైనా అన్యాయం చేసిందని మీరు భావిస్తే, మీరు ముందుగా అసోసియేషన్ ప్రెసిడెంట్ – సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
మిమ్మల్ని బెదిరించినా, వేధించినా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు వినకపోతే మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
పౌర హక్కులను ఉల్లంఘించిన సందర్భంలో, సొసైటీ రిజిస్ట్రార్‌లో RWA పై ఫిర్యాదు చేయవచ్చు. సొసైటీ రిజిస్ట్రార్ RWA మీపై చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోకుండా ఆపగలరు. ఇది అసోసియేషన్ పాలకమండలిని సస్పెండ్ చేయగలదు. అంతేకాకుండా, మీరు సివిల్ కోర్టులో కూడా ఫిర్యాదు చేయవచ్చు. కోర్టు RWA ఆర్డర్‌పై స్టే విధించడంతో పాటు నష్టపరిహారాన్ని కూడా ఆదేశించవచ్చు.
చాలా సార్లు RWA లేదా AOA ఒక ఇంటి యజమాని తన ఇల్లు లేదా ఫ్లాట్‌ను బ్యాచిలర్‌కు అద్దెకు ఇవ్వకూడదు వంటి ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేస్తుంది. లేదా ఒక నిర్దిష్ట కులం లేదా మతానికి చెందిన వ్యక్తులకు కూడా.అద్దెకు ఇవ్వకూడదని చెప్పవచ్చు. RWAకి ఇలా ఎవరిని అద్దెదారుగా ఉంచుకోవాలో ఎవరిని అద్దెదారుగా ఉంచుకోకూడదో ఏ ఇంటి యజమానికి చెప్పడానికి చట్టపరమైన హక్కు లేదు. DM అంటే జిల్లా మేజిస్ట్రేట్ లేదా కోర్టుకు కంప్లైంట్ చేస్తే.. వారు అటువంటి ఆదేశాలను రద్దు చేయవచ్చు.
చాలా చోట్ల, కరెంటు – నీటి బిల్లులు మెయింటెనెన్స్‌తో కలుపుతారు… నివాసి మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించకపోతే, విద్యుత్-నీటి కనెక్షన్‌లు నిలిపివేస్తారని అతనిని బెదిరించవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించనందుకు కరెంటు – నీటి సరఫరాను డిస్‌కనెక్ట్ చేయడం సాధ్యం కాదు. కానీ, మెయింటెనెన్స్ సర్వీస్ ఖచ్చితంగా నిలిపివేయబడవచ్చు… అంతే కాదు, కరెంటు-వాటర్ బిల్లు చెల్లించనందుకు నోటీసు లేకుండా కనెక్షన్ కట్ చేయడం సహజ న్యాయానికి విరుద్ధం…
ఆస్తి విక్రయం సమయంలో, AOA లేదా RWA అమ్మకందారుని బదిలీ రుసుములను చాలా సార్లు అడుగుతుంది… కానీ, అటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉందా? నిపుణుడి నుంచి తెలుసుకుందాం!
UP అపార్ట్‌మెంట్ చట్టం ప్రకారం, అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆస్తి అమ్మకంపై బదిలీ రుసుముగా 0.50 శాతం వసూలు చేయగలదని సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ ప్రశాంత్ కన్హా చెప్పారు… దీని కోసం, సంఘం మోడల్ బై-లాస్‌ను అనుసరించడం అవసరం… డబ్బు భవిష్యత్తులో సమాజంలో నిర్వహించబడే పెద్ద మరమ్మతుల కోసం ఉపయోగిస్తారు. బదిలీ ఛార్జీల ద్వారా చేసిన సేకరణ – ఖర్చుల వివరాలను అడిగే హక్కు ఏ నివాసికైనా ఉంటుంది. RWAలకు వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు నియమాలను కలిగి ఉన్నాయని ఇక్కడ గమనించాలి. ఆయా రాష్ట్రాల నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు.
Published September 8, 2023, 21:49 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.