అనుకున్న ప్రకారం బిల్డర్ మీ ఇల్లు ఇవ్వలేదా? రెరా లో ఫిర్యాదు చేయండి ఇలా.. php // echo get_authors();
?>
నిఖిల్ సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచి, అతనికి ఒకే ఒక కల ఉండేది… తనకు కనీసం సొంత ఇల్లు అయినా ఉండాలి అనేది ఆ కల. అతని ఆదాయం పెరిగినప్పుడు, అతను ఒక ఫ్లాట్ బుక్ చేసుకుని తన కలను నెరవేర్చుకున్నాడు… 2021 సంవత్సరంలో తనకు ఇల్లు వస్తుందని..
నిఖిల్ సంపాదించడం ప్రారంభించినప్పటి నుంచి, అతనికి ఒకే ఒక కల ఉండేది… తనకు కనీసం సొంత ఇల్లు అయినా ఉండాలి అనేది ఆ కల. అతని ఆదాయం పెరిగినప్పుడు, అతను ఒక ఫ్లాట్ బుక్ చేసుకుని తన కలను నెరవేర్చుకున్నాడు… 2021 సంవత్సరంలో తనకు ఇల్లు వస్తుందని చాలా సంతోషించాడు. . కానీ అలా జరగలేదు… నిఖిల్ బిల్డర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ విసిగిపోయాడు… ప్రతిసారీ కొత్త విజిటింగ్ డేట్ ఇస్తున్నారు బిల్డర్స్. కానీ ప్రతిసారీ ఇల్లు రెడీ అవడం లేదు. ఈ పరిస్థితిలో అతనికి తెలిసినవారు రెరాకి వెళ్లమని సలహా ఇచ్చారు… కానీ నిఖిల్ RERA ఎలా పనిచేస్తుందో తెలియదు… అతను RERAలో ఎప్పుడు, ఎలా ఫిర్యాదు చేయవచ్చు? ఇప్పుడు నిఖిల్.. నిఖిల్ లాంటి చాలామంది సమస్య పరిష్కారం కోసం రేరా ఎలా పనిచేస్తుంది చూద్దాం.
నిఖిల్ వంటి ఇల్లు కొనుక్కునే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు 2016 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ నియంత్రణ .. అభివృద్ధి చట్టం తీసుకొచ్చారు. దీని అమలు కోసం రాష్ట్ర స్థాయిలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను ఏర్పాటు చేయడం ఈ చట్టం ఉద్దేశం. రియల్ ఎస్టేట్ రంగంలో RERA ప్రయోజనాలు ఏమిటి..? ఇక్కడ కొన్నిటిని తెలుసుకుందాం.
1. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్న లేదా 8 కంటే ఎక్కువ అపార్ట్‌మెంట్‌లను నిర్మించే ఏ బిల్డర్ అయినా, అటువంటి ప్రాజెక్ట్‌లను RERA కింద రిజిస్టర్ చేసుకోవడం అవసరం…బిల్డర్ నమోదు చేయని ప్రాజెక్ట్‌ను విక్రయిస్తే లేదా విక్రయించడానికి ప్రయత్నించినట్లయితే, RERAకి ఫిర్యాదు చేయవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువైతే, ప్రాజెక్ట్ విలువలో 10 శాతానికి సమానమైన జరిమానా విధిస్తారు.
2. నిఖిల్‌లాగా, చాలా మంది ఇళ్ళ కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్య సమయానికి ఇల్లు అందకపోవడం. బిల్డర్ ఇల్లు అమ్మేటప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇంటిని డెలివరీ చేయడంలో ఆలస్యం చేస్తే, ఇంటి కొనుగోలుదారు RERAకి ఫిర్యాదు చేయవచ్చు. స్వాధీనం చేసుకునేంత వరకూ మీరు కనుక ఆ ప్రాజెక్ట్‌లో కొనసాగాలనుకుంటే, కనుక మీరు స్వాధీనం చేసుకునే వరకు ఆలస్యమైన వడ్డీని అడగవచ్చు. ఒకవేళ ఇంటి నిర్మాణం మరింత ఆలస్యం అయి.. ఇల్లు పొందే అవకాశం లేకుంటే, మీరు వడ్డీతో సహా మీరు చెల్లించిన డబ్బు రిఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు.
3. కొనుగోలుదారు తప్పుడు ప్రకటన లేదా ప్రాస్పెక్టస్‌తో తప్పుదారి పట్టించి, అడ్వాన్స్‌ను తీసుకుంటే, లేదా బిల్డర్ ఇచ్చిన ఏదైనా తప్పుడు సమాచారం కారణంగా మీరు నష్టపోయినట్లయితే, ప్రమోటర్ అంటే బిల్డర్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
4. బిల్డర్ ఏదైనా సదుపాయాన్ని కల్పిస్తానని ముందు చెప్పి.. తరువాత ప్రాజెక్ట్‌లో ఈ సౌకర్యాలు లేవని హోమ్ కొనుగోలుదారు భావిస్తే, అప్పుడు రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు తీసుకున్న తర్వాత కొనుగోలుదారు ప్రాజెక్ట్ నుంచి బయటకు రావచ్చు. ప్రాజెక్టు నుంచి బయటకు రాకపోతే నష్టపరిహారం ఇవ్వమని కోరవచ్చు.
5. ఒక ప్రాజెక్ట్‌లో నిర్మాణ లోపం కనబడితే, కొనుగోలుదారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అందిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. బిల్డర్ ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా 30 రోజులలోపు లోపాన్ని సరిదిద్దాలి. ఈ సందర్భంలో కొనుగోలుదారు పరిహారం పొందేందుకు అర్హులు.
6. ప్రాజెక్ట్ లేఅవుట్‌లో పెద్ద మార్పులకు ఇంటి కొనుగోలుదారుల ఆమోదంలో మూడింట రెండు వంతుల అనుమతి అవసరం… ఈ హక్కు గృహ కొనుగోలుదారులకు చెందినది, చేసే మార్పుల్లో వారి అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టానుసారం బిల్డర్ లే అవుట్ లో మార్పులు చేస్తే బిల్డర్ పై ఫిర్యాదు చేయవచ్చు.
RERAలో ఫిర్యాదు చేయడం ఎలా? అనేది చూద్దాం.
ప్రాజెక్ట్ ప్రమోటర్ లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, చట్టంలోని సెక్షన్ 31 కింద సంబంధిత రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు… కేటాయింపుదారులు అంటే కొనుగోలుదారులు ఆన్‌లైన్ .. ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.
ఉదాహరణకు, తెలంగాణ రేరా అంటే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా http://rera.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోని ఫిర్యాదు విభాగానికి వెళ్లడం ద్వారా ఆన్‌లైన్ ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. ఫార్మాట్-Mని పూరించడం ద్వారా రెరా ఆఫీస్‌లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏపీ రేరా అంటే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద ఫిర్యాదు చేయవచ్చు లేదా https://rera.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో కంప్లైంట్ చేయవచ్చు. ఇందుకోసం కేవలం రూ.1,000 ఫీజు చెల్లించాలి అంతే.
మీరు నిఖిల్ లాగా ఇబ్బంది పడకూడదనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి… ఎవరైనా పరిచయస్తులు లేదా బంధువుల సలహా మేరకు ఇల్లు కొనకండి… ఇల్లు కొనే ముందు ప్రాజెక్ట్ RERA రిజిస్ట్రేషన్‌ని చెక్ చేయండి… దీని ట్రాక్ రికార్డ్‌ను తనిఖీ చేయండి. డెవలపర్ అంటే బిల్డర్ గతంలో ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి డెలివరీ చేసినా చేయకపోయినా… ఫిర్యాదు చేసే ముందు ప్రాజెక్ట్ .. ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. RERA చట్టం అమలుకు ముందు కేసుల కోసం, వినియోగదారు న్యాయస్థానాన్ని లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి…
Published September 6, 2023, 21:01 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.