SEBI తీసుకురాబోతున్న PVA గురించి పూర్తిగా తెలుసుకోండి php // echo get_authors();
?>
విశాఖపట్నానికి చెందిన దీపక్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాడు. అతనికి ఒక అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అంటే AMC నుంచి చాలా మెసేజెస్ అందుకుంటున్నాడు. తమ వద్ద ఉన్న ఒక ప్రత్యెక పథకం తమ వద్ద ఉందని చెబుతున్నారు. దీనిలో..
విశాఖపట్నానికి చెందిన దీపక్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాడు. అతనికి ఒక అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అంటే AMC నుంచి చాలా మెసేజెస్ అందుకుంటున్నాడు. తమ వద్ద ఉన్న ఒక ప్రత్యెక పథకం తమ వద్ద ఉందని చెబుతున్నారు. దీనిలో అద్భుతమైన రాబడి వస్తుంది ఆ మెసేజెస్ లో చెబుతూ వస్తున్నారు. అయితే, రిటర్న్‌లు లేదా పనితీరుకు సంబంధించి AMC చెబుతున్న మాటలను ఎలా నమ్మాలి అని దీపక్ ఆలోచిస్తున్నాడు.
దీపక్ వంటి ఇన్వెస్టర్స్ ఆందోళనలను పరిష్కరించడానికి, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త అడుగు వేస్తోంది. SEBI సన్నాహాలు పథకాల పనితీరు గురించి విపరీతమైన రాబడుల ప్రచారాలకు చెక్ పెడతాయి. సెబీ అటువంటి క్లెయిమ్‌లను పరిశీలించి, వాటిపై ఆమోద ముద్ర వేసే పనితీరు ధ్రువీకరణ ఏజెన్సీ (PVA)ని రూపొందించాలని ప్రతిపాదించింది. ఈ ఏజెన్సీ రేటింగ్ ఏజెన్సీ లానే స్వతంత్రంగా పని చేస్తుంది. సాధారణ పెట్టుబడిదారులకు వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాలు- ఇతర పెట్టుబడి మార్గాల కోసం రేటింగ్‌ను అందిస్తుంది.
SEBI ఈ చర్య పెట్టుబడి పరిశ్రమలో పారదర్శకత – విశ్వసనీయతను పెంపొందించడం, పెట్టుబడిదారులు మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయడం అలాగే AMCలు – ఇతర ఆర్థిక సంస్థల ద్వారా తప్పుదారి పట్టించే ప్రచారాల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
SEBI-నమోదిత మీడియేటర్స్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలు, మరిన్నింటి నుంచి పెట్టుబడి సలహాలకు సంబంధించిన క్లెయిమ్‌లను ధృవీకరించే బాధ్యత PVAకి ఉంటుంది. ఈ ప్రయోజనం కోసం, PVA మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు లేదా ఇతర సంస్థల నుంచి సహేతుకమైన ఫీజును వసూలు చేస్తుంది.
రిటర్న్‌లు, రిస్క్‌లు, హెచ్చుతగ్గులు, ఇతర సంబంధిత పారామితులతో సహా ఈ క్లెయిమ్‌లు ఏజెన్సీ ద్వారా ద్రువీకరిస్తారు. పబ్లిక్ ఇన్‌పుట్ – అభిప్రాయాలను సేకరించేందుకు ఈ ప్రతిపాదనపై సెబీ ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది.
అసలు PVA అవసరం ఏమిటి? అనేది తెలుసుకుందాం. తరచుగా, అనేక సంస్థలు తమ పనితీరు గురించి అతిగా ప్రచారం చేస్తాయి. లేదా ఎక్కువ మంది క్లయింట్‌లను ఆకర్షించడానికి.. వారి వ్యాపారాన్ని విస్తరించడానికి వారి పథకాల గురించి నిరంతరం కస్టమర్‌లకు సిఫార్సులు చేస్తాయి. ఇది పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించగలదు. మ్యూచువల్ ఫండ్ పథకాల పనితీరు గణన సాధారణంగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) చేస్తుంది. . అదేవిధంగా, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు కొన్ని బెంచ్‌మార్క్‌ల ఆధారంగా వారి పనితీరు గురించి సమాచారాన్ని అందిస్తారు. వారి క్లెయిమ్‌లు ప్రస్తుతం కొంతవరకు సెల్ఫ్ కన్ఫర్మేషన్ గా ఉంటాయి. అంటే వారు దానిని స్వయంగా ధృవీకరిస్తారు. వాటిని ధృవీకరించే మూడవ పక్షం ఏజెన్సీ లేదు.
అదే విధంగా, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ (IAs), రీసెర్చ్ అనలిస్ట్‌లు (RAs) షేర్లలో పెట్టుబడి పెట్టడం, కొనడం, అమ్మడం లేదా హోల్డింగ్ చేయడం గురించి సలహాలను అందిస్తారు. మీడియేటర్స్ కూడా పెట్టుబడిదారుల దృష్టిలో తమ విశ్వసనీయతను పొందడానికి లేదా పెంచుకోవడానికి అటువంటి ఏజెన్సీని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి, రిజిస్టర్డ్ మీడియేటర్స్ వారి పనితీరును ప్రోత్సహించడానికి – పెట్టుబడిదారుల కోణం నుంచి తనిఖీలు అలాగే స్టాక్స్ నిర్వహించడానికి SEBI యోచిస్తోంది.
PVA ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంటుంది? చూద్దాం..
పనితీరు ధ్రువీకరణ ఏజెన్సీ అంటే PVA స్వతంత్ర సంస్థగా ఉంటుంది. PVA క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లానే నాలెడ్జ్ పార్టనర్‌తో కలిసి పని చేయవచ్చు. ఈ ప్రక్రియలో పొందిన సమాచారం పూర్తి గోప్యతను PVA నిర్వహించాల్సి ఉంటుంది.
PVA ద్వారా, నాలుగు రకాల క్లెయిమ్‌లు కన్ఫర్మ్ చేస్తారు. ముందుగా, సలహాదారు సిఫార్సు ఆధారంగా క్లయింట్ అందుకున్న వాస్తవ లాభాల క్లెయిమ్. రెండవది, సెబీ-నమోదిత మీడియేటర్స్ లేదా ఇతర సంస్థల పనితీరు లేదా అల్గోరిథం గురించిన క్లెయిమ్స్. మూడవది, ఏదైనా సంస్థ సూచించిన షేర్లు లేదా పోర్ట్‌ఫోలియోల పనితీరు గురించిన క్లెయిమ్స్. నాల్గవది, సారూప్య స్వభావం గల ఏవైనా ఇతర వాదనలు. కస్టమర్ డేటా గోప్యత సంరక్షించబడే విధంగా ఏజెన్సీ మీడియేటర్స్ డేటా అలాగే క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. SEBI ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాన్ని కోరింది. ఈ అభిప్రాయాన్ని అందించడానికి గడువు సెప్టెంబర్ 21, 2023 వరకూ ఉంది.
Published September 7, 2023, 14:52 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.