ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్.. గత ఆరు నెలలుగా ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను చూశాడు. కానీ పెరుగుతున్న ధరల కారణంగా ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ధైర్యం చేయలేకపోతున్నాడు. RBI తన పాలసీ రేట్లను..
ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్.. గత ఆరు నెలలుగా ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను చూశాడు. కానీ పెరుగుతున్న ధరల కారణంగా ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ధైర్యం చేయలేకపోతున్నాడు. RBI తన పాలసీ రేట్లను పెంచిన తర్వాత, అతని సమస్య మరింత పెరిగింది. అతను ఇంటిని కొనుగోలు చేయాలనే ప్లాన్ ను కొనసాగించాలా లేదా వాయిదా వేయాలా అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అర్ధం చేసుకుందాం.
ఆగస్టులో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో RBI వడ్డీ రేట్లలో వరుసగా మూడోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణ అంచనాను ఒక శాతం నుంచి 6.2 శాతానికి పెంచింది. అదే సమయంలో, వచ్చే ఏడాదికి లోన్స్ చౌకగా మారే అవకాశం ఆశాజనకంగా లేదని సంకేతాలు ఇచ్చారు. రాహుల్ లాంటి చాలా మంది రుణాలు చౌకగా లభిస్తాయని, తద్వారా ఇల్లు కొనాలనే వారి కల నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, చాలా పెద్ద బ్యాంకులు హోం లోన్స్ పై వడ్డీ రేట్లను మళ్లీ పెంచాయి. దీనితో పాటు, కరోనావైరస్ మహమ్మారి తరువాత, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు వేగంగా పెరిగాయి.
CREDAI రిపోర్ట్ ప్రకారం, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో ప్రాపర్టీ ధరలు 16 శాతం పెరిగాయి. రాహుల్ లాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యల వెనుక కారణం ఇదే. కాబట్టి, ఇప్పుడు రాహుల్ ముందు ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఇల్లు కొనడానికి బ్యాంకులు ఆస్తి ధరలో 90 శాతం వరకు రుణంగా ఇస్తాయి. హోమ్ లోన్ EMI అధిక భారాన్ని నివారించడానికి, రాహుల్ డౌన్ పేమెంట్ కోసం వీలైనంత ఎక్కువ డబ్బును ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం, అతను FD, RD, డెట్ ఫండ్ వంటి తక్కువ రాబడి పెట్టుబడులను ఉపయోగించవచ్చు.
రాహుల్ అలాంటి పెట్టుబడి ఎంపికలపై హోమ్ లోన్ వడ్డీ కంటే తక్కువ రాబడిని పొందుతారు. కాబట్టి, ప్రత్యేకించి మీ దగ్గర డబ్బు ఉన్నపుడు అధిక వడ్డీ రేట్లకు ఎక్కువ లోన్ తీసుకోవడం తెలివైన పని కాదు. గత ఏడాది కాలంలో ఆస్తి ధర వేగంగా పెరిగిందని వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి చెప్పారు. హోమ్ లోన్ రేట్లు కూడా రెండంకెలకు దగ్గరగా ఉన్నాయి. రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆయన అంటున్నారు. ఇల్లు కొనుక్కోవాలంటే ఆలోచనాత్మకంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
లోన్ కోసం వెళ్ళే ముందు ముందు డౌన్ పేమెంట్ కోసం వీలైనంత ఎక్కువ డబ్బును ఏర్పాటు చేసుకోవడం మంచిది. హోమ్ లోన్ చెల్లింపు మొత్తాన్ని వీలైనంత తక్కువగా ఉంచండి. ఇది EMI మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. మీరు డౌన్ పేమెంట్ కోసం మీ సేవింగ్స్ కూడా ఉపయోగించవచ్చు. మీరు మీ పదవీ విరమణ మొదలైన వాటి కోసం దీర్ఘకాలిక పెట్టుబడిని చేసి ఉంటే, ఇంటి కోసం దానిని మీరు బ్రేక్ చేయకూడదు. నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోందని జితేంద్ర సోలంకి చెప్పారు. అటువంటి పరిస్థితిలో, ఇల్లు, కారు, ఇతర లోన్స్ EMI మొత్తం మీ నెలవారీ ఆదాయంలో 40 శాతానికి మించకూడదు. మీ EMI ఈ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, డిఫాల్ట్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. డౌన్ పేమెంట్‌కు సరిపడా డబ్బు రాహుల్ వద్ద ఉంటే, ఇంటి కోసం లోన్ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేసేందుకు ముందుకు వెళ్లవచ్చు. డబ్బుల ఏర్పాటు లేకుంటే ఇంటి ప్లానింగ్ వాయిదా వేయాలి. అలాగే అతను డౌన్ పేమెంట్ కోసం డబ్బును ఆదా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి, తద్వారా అతను దానిని సౌకర్యవంతంగా పొందగలడు.
Published August 17, 2023, 21:23 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.