వీరేంద్ర న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అతని ముఖంలో చిరునవ్వుతో వెలిగిపోతోంది. అది చూసి అతని భార్య అతని చిరునవ్వు వెనుక కారణం అడిగింది. ఎందుకు అంత సంతోషం.. ఆ పేపర్ లో ఏముంది?..
వీరేంద్ర న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అతని ముఖంలో చిరునవ్వుతో వెలిగిపోతోంది. అది చూసి అతని భార్య అతని చిరునవ్వు వెనుక కారణం అడిగింది. ఎందుకు అంత సంతోషం.. ఆ పేపర్ లో ఏముంది? అంటూ ప్రశ్నించింది. EMIలో నిరంతర పెరుగుదల బాధ నుంచి త్వరలో మనకు రిలీఫ్ దొరకవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు వీరేంద్ర. అలా ఎలా? అంటూ అడిగింది అతని భార్య. వీరేంద్ర లానే మీరూ ఎప్పటికప్పుడు పెరుగుతున్న EMIతో టెన్షన్ పడుతున్నారా? అయితే, మీకోసం ఒక ఇంపార్టెంట్ అప్ డేట్ ఉంది..
వడ్డీ రేటులో మార్పులు చేస్తున్నప్పుడు… కస్టమర్‌లు తప్పనిసరిగా ఫిక్స్ డ్ రేట్ హోమ్ లోన్ కోసం వెళ్లే అవకాశాన్ని అందించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఫిక్స్ డ్ రేట్ హోమ్ లోన్ అంటే ఏమిటి? ఫ్లోటింగ్ రేట్ లోన్‌కు బదులుగా ఫిక్స్‌డ్ రేట్ లోన్‌ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందా? తెలుసుకుందాం…
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును రెండున్నర శాతం పెంచింది… ఆ తర్వాత బ్యాంకులు గృహ రుణాలు సహా పలు రుణాల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోయాయి.
వడ్డీ రేట్ ఆధారంగా మొత్తం రెండు రకాల హోమ్ లోన్స్ ఉన్నాయి. అవి ఫిక్స్‌డ్ రేట్ హోమ్ లోన్ అలాగే ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్. ఫ్లోటింగ్-రేట్ హోమ్ లోన్‌ల వడ్డీ రేట్లు రెపో రేటు వంటి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. రెపో రేటు పెరిగినప్పుడు, లోన్ రేట్లు పెరుగుతాయి. అది తగ్గినప్పుడు, హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. వడ్డీ రేటు పెరుగుదల అధిక EMIలు లేదా లోన్ కాలపరిమితి పెరగడానికి దారితీస్తుంది…
ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్‌లలో, లోన్ శాంక్షన్ చేసేటప్పుడు బ్యాంక్ నిర్ణయించిన వడ్డీ రేటు… మొత్తం లోన్ టెన్యూర్ అంతా అలాగే ఉంటుంది. రెపో రేటులో మార్పులు ఎటువంటి ప్రభావం చూపవు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే… లోన్‌పై ఎంత EMI అవసరం.. మొత్తం ఎంత చెల్లించాలి అనేది లెక్క వేసుకుని ఖచ్చితమైన బడ్జెట్ ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడుతుంది
ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్ వడ్డీ రేటు సాధారణంగా ఫ్లోటింగ్-రేట్ ఆధారిత లోన్ కంటే ఎక్కువగా ఉంటుంది. వివిధ రిపోర్ట్స్ ప్రకారం ఫ్లోటింగ్-రేట్ హోమ్ లోన్‌లతో పోలిస్తే, ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్‌ల వడ్డీ రేట్లు 100 నుంచి 500 బేసిస్ పాయింట్ల మధ్య తేడా ఉండవచ్చు. అంటే 1 నుంచి 5 శాతం తేడా ఉంటుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం… రెపో రేట్-లింక్డ్, అంటే ఫ్లోటింగ్-రేటు హోమ్ లోన్‌ల కోసం… జీతం-స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు వడ్డీ రేటు 9%… అయితే ఒక పూర్తి-కాల స్థిర హోమ్ లోన్ 11.15% నుంచి 11.45% మధ్య ఉంటుంది. అంటే దాదాపు 1.2 నుంచి 1.3 శాతం ఎక్కువ. అదేవిధంగా, యాక్సిస్ బ్యాంక్ కోసం, ఫ్లోటింగ్ హోమ్ లోన్‌లపై వడ్డీ రేటు 9% నుంచి 9.40% మధ్య ఉంటుంది. అయితే ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్ వడ్డీ రేటు వార్షికంగా 14% స్థిరంగా ఉంటుంది. ఇక్కడ రేటు దాదాపు 4.6 నుండి 5 శాతం ఎక్కువ.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం ఎప్పుడు ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్ ఎంచుకోవచ్చుఅనేది చూద్దాం. భవిష్యత్తులో రుణాల కోసం వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని మీరు భావించినప్పుడు… ప్రస్తుత రేటు మీరు లోన్ సౌకర్యవంతంగా తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది… అయితే, వడ్డీ రేట్లను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం… అంతేకాకుండా, రుణాలను మార్చేటప్పుడు, స్థిర గృహ రుణంపై మీరు పొందుతున్న వడ్డీ రేటు ఫ్లోటింగ్ రేటు కంటే 150 నుంచి 200 బేసిస్ పాయింట్‌ల కంటే ఎక్కువగా లేదని నిర్ధారించుకోండి.
వీరేంద్ర వంటి కస్టమర్‌లు కూడా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు సెమీ-ఫిక్స్‌డ్ రేటును ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో, స్థిరమైన – ఫ్లోటింగ్ రేట్లు రెండిటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ప్రారంభ 2, 3, 5, లేదా 10 సంవత్సరాలకు, వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. ఆ తర్వాత, లోన్ ఫ్లోటింగ్ రేట్‌కి మారుతుంది. పెరుగుతున్న EMI నుంచి వీరేంద్రకు ఉపశమనం లభిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
అయితే, ఫ్లోటింగ్ – ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్స్ మధ్య వడ్డీ రేట్ల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే… బ్యాంకులు తమ కస్టమర్‌లు ఫిక్స్‌డ్ రేట్ లోన్‌లను తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది. బ్యాంకులు – ఎన్‌బిఎఫ్‌సిల బోర్డుల నుంచి ఆమోదింఛిన పాలసీ ప్రకారం… కస్టమర్‌లు ఫిక్స్‌డ్ రేట్‌కి మారే అవకాశం ఉంటుంది. అయితే, ఆ సమయంలో వడ్డీ రేట్లలో గణనీయమైన వ్యత్యాసం కొనసాగితే. లోన్స్ వడ్డీ రేట్ల మధ్య మారడం కస్టమర్లకు సవాలుగా ఉండవచ్చు. లోన్ విధానం మార్పిడికి సంబంధించిన ఫీజులు కూడా ఉండే అవకాశం ఉంది.
Published August 29, 2023, 21:50 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.