భారీగా పెరుగుతున్న హాస్పిటల్ ఖర్చులు.. ఎంతలా అంటే.. php // echo get_authors();
?>
ఆనందరావు ముక్కు ఎముక అసాధారణ పెరుగుదల కనబరుస్తోంది. కరోనా ఉధృతంగా ఉన్నరోజుల్లో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో తన ముక్కు సమస్య కోసం చికిత్స తీసుకున్నాడు. అయితే, దానికి ఆపరేషన్ అవసరం అవుతుందనీ.. లక్ష రూపాయలు ఖర్చు అవుతుందనీ డాక్టర్ చెప్పారు...
ఆనందరావు ముక్కు ఎముక అసాధారణ పెరుగుదల కనబరుస్తోంది. కరోనా ఉధృతంగా ఉన్నరోజుల్లో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో తన ముక్కు సమస్య కోసం చికిత్స తీసుకున్నాడు. అయితే, దానికి ఆపరేషన్ అవసరం అవుతుందనీ.. లక్ష రూపాయలు ఖర్చు అవుతుందనీ డాక్టర్ చెప్పారు. ఇప్పుడు అంత ప్రమాదం ఏమీలేదు కదా తరువాత చేయించుకోవచ్చని ఆనందరావు ఆపరేషన్ వాయిదా వేసుకున్నాడు. అయితే.. ఈ మధ్య ఆపరేషన్ చేయించు కోవాలని హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ ఇప్పుడు ఆపరేషన్ కోసం రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఆనందరావు షాక్ అయ్యాడు.
ఇది ఆనందరావు సమస్య మాత్రమే కాదు. ఇన్సూరెన్స్ పోర్టల్ పాలసీబజార్ సర్వే ప్రకారం, గత ఐదేళ్లలో చికిత్స ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2018లో, ఆసుపత్రిలో సగటు చికిత్స ఖర్చు 24,569 రూపాయలు. ఇది 2022లో 64,135 రూపాయలకు పెరిగింది. కాబట్టి, గత ఐదేళ్లలో చికిత్స ఖర్చు 160 శాతం పెరిగింది. మెట్రో నగరాల్లో చికిత్స ఖర్చు వేగంగా పెరిగింది. కోవిడ్ తర్వాత, ఖరీదైన చికిత్స ప్రభావం ప్రజల బడ్జెట్‌పై పడుతుందని నిపుణులు ముందుగానే ఊహించారు. కానీ, దీని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని అంచనా వేయలేదు. ఇది మాత్రమే కాదు, వివిధ ఆసుపత్రులలో ఒకే చికిత్సకు అయ్యే ఖర్చులో భారీ వ్యత్యాసం ఉంది. ఆసుపత్రి ఎంత పెద్దది అయితే.. చికిత్స ఖర్చు అంత ఎక్కువ అవుతోంది.
దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం. కరోనా సమయంలో, ఆసుపత్రులు చికిత్స పేరుతో కొన్ని కొత్త సౌకర్యాలను తీసుకువచ్చాయి. ఆసుపత్రులు రోగులను వ్యాధి బారిన పడకుండా రక్షించడానికి కొన్ని కొత్త ఏర్పాట్లు చేశాయి. దీంతో చికిత్స ఖర్చు పెరిగింది. మహమ్మారి ముగిసిన తర్వాత, పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడానికి ఖర్చులో ఎటువంటి తగ్గింపు చేయలేదు. బదులుగా, ఖర్చు చాలా రెట్లు పెరిగింది. ఫలితంగా, హెల్త్‌కేర్‌లో ద్రవ్యోల్బణం 14 శాతం పెరుగుతోంది అంటే ప్రస్తుతం ఏడు శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం కంటే రెండింతలు వేగంగా వృద్ధి చెందుతోంది. అంటే ఇప్పుడు ఒక వ్యాధికి చికిత్సకు 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే వచ్చే ఐదేళ్లలో అది 6 లక్షల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.
జాతీయ ఆరోగ్య ప్రొఫైల్-2021 ప్రకారం, సగటున, ఆసుపత్రిలో చేరడానికి ఒక సారి అయ్యే ఖర్చులో 80 శాతానికి పైగా ప్రజలు తమ సొంత జేబుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ‘అవుట్ ఆఫ్ పాకెట్’ మెడికల్ ఎక్స్ పెన్సేస్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఇటువంటి వైద్య ఖర్చుల కారణంగా, భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదలుగా మారుతున్నారు. ఆరోగ్యంపై పెరుగుతున్న వ్యయం కారణంగా, ప్రతి సంవత్సరం 8-9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.
మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు డాక్టర్ రాహుల్ శర్మ ఈ పరిస్థితిపై మాట్లాడుతూ, కరోనా తర్వాత, ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం ప్రాముఖ్యత గురించి ప్రజలు తెలుసుకున్నారు. బీమాకు యాక్సెస్ పెరగడంతో, ఆరోగ్య సేవలకు డిమాండ్ అలాగే వినియోగం పెరుగుతోందని చెప్పారు. దీంతో చికిత్స ఖర్చు పెరుగుతుంది. చికిత్స ఖర్చులో ఎక్కువ భాగం రోగనిర్ధారణ అలాగే మెడిసిన్స్ వైపు వెళుతుంది. గత మూడేళ్లలో మందుల ధరలు 15-20 శాతం పెరిగాయి. క్లెయిమ్‌ల సంఖ్య పెరిగినందున, ఆరోగ్య బీమా కంపెనీలు ప్రీమియంలను కూడా పెంచుతున్నాయి. గత ఏడాది కాలంలో ప్రీమియంలు 10 నుంచి 25 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఏ జబ్బు వచ్చినా చికిత్సకు ఎంత ఖర్చవుతుందన్న పరిమితి లేదని… ఆసుపత్రులు చికిత్స పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయని డాక్టర్ శర్మ చెప్పారు. దీంతో అధిక సంఖ్యలో ప్రజలు సకాలంలో వైద్యం పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఏదైనా కఠినమైన నిబంధనలను రూపొందించినట్లయితే, ఆరోగ్య సంరక్షణలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు అని ఆయన అభిప్రాయపడుతున్నారు.
Published September 7, 2023, 15:05 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.