ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పన్నుల విషయంలో బడ్జెట్లో అనేక మార్పులు చేశారు. తద్వారా కష్టపడి పనిచేసే వేతన జీవులకు కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే, కొత్త పన్ను విధానంలో అన్ని ప్రధాన మార్పులు చేసింది కేంద్రం. ఈ వ్యవస్థ 2020 సంవత్సరపు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. రాయితీలు, తగ్గింపులను పొందని పన్ను చెల్లింపుదారుల కోసం ఈ విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా మార్చాలని కూడా నిర్ణయించారు. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అంటే కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానం ప్రకారం.. ప్రస్తుతం ఈ పరిమితి రూ.5 లక్షల వరకు మాత్రమే. 2023 బడ్జెట్ మిమ్మల్ని, మీ పన్నులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి 5paisa.comని సందర్శించండి.
ఇది కాకుండా కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబ్‌ల సంఖ్యను 6 నుండి 5కి తగ్గించారు. అలాగే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు. కొత్త పన్ను విధానంలో ప్రతిపాదిత రేట్లు కింది విధంగా ఉన్నాయి. 0 నుంచి 3 లక్షల ఆదాయంపై పన్ను లేదు. రూ. 3,00,001 నుంచి 6 లక్షల ఆదాయంపై 5%, 600001 నుంచి 9 లక్షల ఆదాయంపై 10%, 900001 నుంచి 12 లక్షల ఆదాయంపై 15%, 1200001 నుంచి 15 లక్షల ఆదాయంపై 20%, అలాగే రూ.15 లక్షల కంటే ఎక్కవ వార్షిక ఆదాయంపై 30% పన్ను విధిస్తారు.
అత్యధిక పన్ను రేట్లు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో పన్ను శ్లాబ్‌లలో మార్పు కాకుండా కొత్త పన్ను విధానంలో గరిష్ట సర్ఛార్జ్ రేటును 37 శాతం నుండి 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది కేంద్రం. ఈ రేట్లు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయానికి వర్తిస్తాయి.
ఇప్పటి వరకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పాత పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోజనం జీతాలు, పెన్షనర్లకు అందిస్తారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రకారం.. రూ. 15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వేతనం పొందే ప్రతి వ్యక్తి ఫలితంగా రూ.52,500 ప్రయోజనం పొందుతారు.
2023 బడ్జెట్లో ప్రభుత్వం లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచింది కేంద్రం. ఇది ప్రైవేట్ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. గతంలో 2002లో రూ.3 లక్షలకు పెంచారు.
Published February 18, 2023, 19:20 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.