అనూషకు వేరే తెలియని నంబర్‌ల నుంచి కాల్స్ వస్తున్నాయి.. కాలర్లు ఆమెను ఒకే ఒక్క విషయం అడిగారు. ఆమె షేర్ ట్రేడింగ్ ఎలా జరుగుతోంది? అయితే, అనూష ఎలాంటి షేర్ ట్రేడింగ్ చేయదు. ఆమె ఫోన్ నంబర్ గురించి అడిగినప్పుడు, ఆమె వారి ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో తన నంబర్ రిజిస్టర్ చేసిఉందని అవతలి వారు చెబుతున్నారు. అందుకే ఆమెకు కాల్ చేస్తున్నామని అంటున్నారు. కానీ ఏ సైట్ లో అలా ఉందొ చెప్పమని అడిగితె, ఆమెకు అస్పష్టమైన సమాధానాలు వచ్చాయి. బదులుగా. . తమ సైట్ సెబీ రిజిస్టర్డ్ అని చెప్పడం మొదలు పెట్టారు.
మరో రోజు ఇలాంటి కాల్ రావడంతో అనూష ఆగలేక కాలర్ పై విరుచుకుపడింది. తర్వాత ఏం జరుగుతుందో.. ఇప్పుడు ఎన్ని కాల్స్, మెసేజ్ లు వస్తాయో చూడు అంటూ కాలర్ ఆమెను బెదిరించాడు. వాట్సాప్, ఫోన్‌లలో ఓటీపీ మెసేజ్‌లతో అనూష ఫోన్ మొగిపోయింది. వివిధ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు, రియల్ ఎస్టేట్ సెర్చ్ పోర్టల్‌ల నుంచి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి.. ఫోన్ నంబర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటూ ఓటీపీ మెసేజ్‌లలో మళ్లీ మళ్లీ రిక్వెస్ట్‌లు రావడం మొదలయ్యాయి.. ఈ వరుస కాల్స్ -సందేశాలు ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.
ఇలా అనూష ఒక్కరికే కాదు దాదాపు ప్రతిరోజూ ఇలాంటి మెసేజ్ లు, చాలా మందికి వస్తున్నాయి.. మీకు అలాంటి కాల్స్ లేదా మెసేజ్ లు రాకపోతే మీరే అదృష్టవంతులు. ప్రస్తుత వాతావరణంలో మీ ఫోన్ నంబర్‌ను రక్షించడం అసాధ్యం. మనం మన నంబర్‌లను వేర్వేరు యాప్‌లలో, వివిధ షాపింగ్ స్టోర్‌లలో ఇస్తాము. ఎవరికి తెలుసు.. ఈ సైబర్ దుండగులు అక్కడ నుంచి మీ నంబర్‌ను తీసుకుని, ఆపై మిమ్మల్ని మోసం చేయడానికి ప్లాన్ చేసే అవకాశం ఉందేమో?
నిపుణులు ఏమంటారు? తెలుసుకుందాం.
సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రితేష్ భాటియా దీన్నే SMS బాంబింగ్ అంటారు. మీరు ఒకరి నంబర్‌ను నమోదు చేస్తే, వారు పెద్దమొత్తంలో మెసేజ్ లను పంపించే యాప్‌లు ఉన్నాయి. అదేవిధంగా, మెసేజ్ లు కూడా పంపించే వీలున్న సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. వీటిపై 50-100, 200-500 మెసేజ్‌ల పరిమితి ఉంది.. ఈ పరిమితి ముగిసే వరకు సందేశాలు వస్తూనే ఉంటాయి..
OTPని ఉపయోగించి మొబైల్ ఫోన్‌లకు పదే పదే OTP SMS సందేశాలను పంపే ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను హ్యాకర్లు అభివృద్ధి చేశారు. అంటే వన్ టైమ్ పాస్‌వర్డ్ వెరిఫికేషన్ APIలు అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ అని అర్ధం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అతను లేదా ఆమె అలాంటి కాల్స్ – మెసేజ్ బాంబింగ్‌లకు బలి అయితే ఏమి చేయాలి?
అలాంటి నంబర్లను బ్లాక్ చేయడం, మెసేజ్‌లు, కాల్‌లను పట్టించుకోవడం మానేయలనేది రితేష్ భాటియా సలహా. దీనికి వేరే పరిష్కారం లేదు. కాల్ మెసేజెస్ పంపే వ్యక్తులు కొంత సమయం తర్వాత మిమ్మల్ని వేధించడం వారికి వారే ఆపివేస్తారు. అంటే అవతలి వ్యక్తి వదులుకునే వరకు మీరు వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది.
మీరు కూడా ఎస్‌ఎంఎస్ బాంబ్ బారిన పడకుండా జాగ్రత్తపడండి.. షాపింగ్ చేస్తున్నప్పుడు, మాల్‌లో తిరుగుతున్నప్పుడు, అక్కడక్కడా యాదృచ్ఛికంగా ఏదైనా కొంటున్నప్పుడు మీ ఫోన్ నంబర్ ఇవ్వడం మానేయండి. అవసరమైన చోట మాత్రమే నంబర్‌ను షేర్ చేయండి. ఇంకొక విషయం, అలాంటి కాల్స్ లేదా మెసేజ్‌లను విస్మరించండి. మీరు ఈ కాల్స్ లేదా మెసేజెస్ కు రెస్పాండ్ అయితే, వారు మిమ్మల్ని మరింత వేధిస్తారు. కొన్నిసార్లు ఎమోషనల్ ప్రెషర్ కూడా సృష్టిస్తారు. మీ ప్రయోజనం కోసం కాల్ చేస్తున్నట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి వారు చెప్పింది చేయకపోతే తిట్టడం వంటి పనులు చేస్తారు. మీ సమయం కూడా విలువైనదే కదా.. అందుకే వారి కాల్స్ కు ఆన్సర్ చేసి వారి మాటల్లో చిక్కుకోకండి. జస్ట్ అటువంటి కాల్స్ ను ఇగ్నోర్ చేయండి. అంతే. వాటికి రెస్పాండ్ అయ్యి ఇబ్బందుల్లో పడకండి. ఇటువంటి వాటి విషయంలో మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం తప్ప మరో మార్గం లేదు.
Trending 9
Exclusive